మరోసారి ఉదారత చాటుకున్న జొకోవిచ్..

ABN , First Publish Date - 2020-05-23T22:11:19+05:30 IST

టెన్నిస్ సూపర్‌స్టార్, వరల్డ్ నెం.1 ఆటగాడు నొవక్ జొకోవిచ్ మరోసారి ఉదారత చాటుకున్నాడు. సెర్బియా క్రుసెవాక్‌లోని ఓ ఆస్పత్రికి తన ఫౌండేషన్ తరఫున ఐదు

మరోసారి ఉదారత చాటుకున్న జొకోవిచ్..

టెన్నిస్ సూపర్‌స్టార్, వరల్డ్ నెం.1 ఆటగాడు నొవక్ జొకోవిచ్ మరోసారి ఉదారత చాటుకున్నాడు. సెర్బియా క్రుసెవాక్‌లోని ఓ ఆస్పత్రికి తన ఫౌండేషన్ తరఫున ఐదు వెంటిలేటర్లు, క్లినికల్ మానిటర్లు విరాళంగా ఇచ్చాడు. ఈ విషయాన్ని జొకోవిచ్ ఫౌండేషన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘కరోనా వైరస్‌తో జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలపాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మేము క్రుసెవాక్‌లోని జనరల్ ఆస్పత్రికి ఐదు వెంటిలేటర్లు, ఐదు క్లినికల్ మానిటర్లు విరాళంగా ఇచ్చాము. ఈ కష్ట సమయంలో అందరిం ఐకమత్యంగా ఉండాలి’’ అంటూ ట్వీట్ చేసింది.


మార్చి నెలలో, జొకోవిచ్, అతని భార్య జెలెనా సెర్బియాలో కరోనా వైరస్‌పై పోరాటం కోసం ఒక మిలియన్ యూరోలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నగదుతో ఆస్పత్రిలు, వైద్య కేంద్రాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయవచ్చుని వాళ్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-23T22:11:19+05:30 IST