పారిస్‌ ఓపెన్‌కు జొకో దూరం

ABN , First Publish Date - 2020-10-22T08:56:47+05:30 IST

పారిస్‌ ఓపెన్‌ నుంచి సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వైదొలిగాడు. ఏటీపీ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం వరల్డ్‌ నెంబర్

పారిస్‌ ఓపెన్‌కు జొకో దూరం

బెల్‌గ్రేడ్‌ (సెర్బియా): పారిస్‌ ఓపెన్‌ నుంచి సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ వైదొలిగాడు. ఏటీపీ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం వరల్డ్‌ నెంబర్‌ వన్‌గా కొనసాగి చరిత్ర సృష్టించాలనేది తన లక్ష్యమని జొకో తెలిపాడు. ఇందుకు అనుగుణంగానే ప్రణాళికాబద్ధంగా ఏ టోర్నీల్లో ఆడాలనేది నిర్ణయించుకుంటున్నానని అతడు చెప్పాడు. ‘పారిస్‌ ఓపెన్‌ బరిలోకి దిగడం వల్ల పెద్దగా పాయింట్లు రావు. ఏడాది చివర్లో జరిగే వియన్నా, లండన్‌ ఓపెన్‌లలో ఆడితే ఒక్కో టోర్నీలో 500పాయింట్లు వచ్చే అవకాశముంది. వాటిలో పాల్గొంటే ర్యాంకింగ్‌ పాయింట్లను మెరుగుపర్చుకోవడంతో పాటు నా తర్వాతి స్థానాల్లోని ఆటగాళ్లకు నాకు మధ్య అంతరాన్ని కూడా కొనసాగించవచ్చు’ అని జొకో వెల్లడించాడు.

Updated Date - 2020-10-22T08:56:47+05:30 IST