జొకోకు చిన్నోడి కోచింగ్‌

ABN , First Publish Date - 2021-06-15T09:28:50+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. ఫైనల్లో తాను ఆడి న రాకెట్‌ను ఓ యువ అభిమానికి బహుమతిగా ఇచ్చాడు. మ్యాచ్‌లో వెనుకబడ్డప్పుడు తగిన వ్యూహాలను...

జొకోకు చిన్నోడి కోచింగ్‌

  • బహుమతిగా రాకెట్‌ ఇచ్చిన నొవాక్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌.. ఫైనల్లో తాను ఆడిన రాకెట్‌ను ఓ యువ అభిమానికి బహుమతిగా ఇచ్చాడు. మ్యాచ్‌లో వెనుకబడ్డప్పుడు తగిన వ్యూహాలను అందించి తనకు మార్గదర్శనం చేసినందుకు కృతజ్ఞతగా ఆ బాలుడికి చాంపియన్‌షి్‌ప రాకెట్‌ను ఇచ్చానని వరల్డ్‌ నంబర్‌ వన్‌ జొకో చెప్పాడు. ‘మ్యాచ్‌ పూర్తయ్యేంత వరకు అతడి మాటలు నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. రెండు వరుస సెట్లు కోల్పోయినప్పుడు అ తడు ఎంతో ప్రోత్సహించాడు. అందుకే మ్యాచ్‌ రాకెట్‌ ఇవ్వడానికి అతడు అన్నిరకాలుగా అర్హుడనిపించింది’ అని జొకోవిచ్‌ చెప్పాడు. తన అభిమాన ఆటగాడి నుంచి రాకెట్‌ అం దుకోగానే ఆ బాలుడు పట్టరాని ఆనందంతో గంతులేశాడు. 


Updated Date - 2021-06-15T09:28:50+05:30 IST