Jam 2023 నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-08-11T21:02:32+05:30 IST

బయో టెక్నాలజీ(Biotechnology), సైన్సెస్‌ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకొనేవారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) 2023’ నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిని ఐఐటీ గువహటీ నిర్వహిస్తోంది.

Jam 2023 నోటిఫికేషన్‌

బయో టెక్నాలజీ(Biotechnology), సైన్సెస్‌ విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ చేయాలనుకొనేవారికోసం ఉద్దేశించిన ‘జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) 2023’ నోటిఫికేషన్‌ వెలువడింది. దీనిని  ఐఐటీ గువహటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా రెండేళ్ల ఎమ్మెస్సీ; ఎంఎస్‌(రిసెర్చ్‌); జాయింట్‌/ డ్యూయెల్‌ డిగ్రీ ఎమ్మెస్సీ - పీహెచ్‌డీ; ఎమ్మెస్సీ - ఎంఎస్‌(రిసెర్చ్‌)/ పీహెచ్‌డీ; ఎమ్మెస్సీ - ఎంటెక్‌; పోస్ట్‌ బ్యాచిలర్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రాములలో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు అందిస్తున్న వివిధ పీజీ ప్రోగ్రామ్‌లలో సుమారు 3000 సీట్లను జామ్‌ స్కోర్‌ ద్వారా నేరుగా భర్తీ చేస్తారు. అలాగే నిట్‌లు, ఐసర్లు, ఐఐఎస్సీ, ఐఐఈఎస్‌టీ, డీఐఏటీ, ఐఐపీఈ, జేఎన్‌సీఏఎస్‌ఆర్‌, ఎస్‌ఎల్‌ఐఈటీ సహా మొత్తం 30 సీఎఫ్‌టీఐ సంస్థల్లోని 2300కు పైగా సీట్ల భర్తీకి ఈ స్కోరునే ప్రామాణికంగా తీసుకొనే అవకాశం ఉంది. 


జామ్‌ పేపర్లు: జామ్‌ ఎగ్జామ్‌ను ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్‌లో కెమిస్ట్రీ, జియాలజీ, మేథమెటిక్స్‌ పేపర్లు; మధ్యాహ్నం సెషన్‌లో బయోటెక్నాలజీ, ఎకనామిక్స్‌, మేథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌ పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు గరిష్ఠంగా రెండు పేపర్లు రాయవచ్చు. రెండు పేపర్లు రాసేవారు ఉదయం సెషన్‌ నుంచి ఒక పేపర్‌, మధ్యాహ్నం సెషన్‌ నుంచి మరో పేపర్‌ ఉండేలా చూసుకోవాలి. 


జామ్‌ 2023 వివరాలు: ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. అన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే ఇస్తారు. మొత్తం 60 ప్రశ్నలకుగాను 100 మార్కులు కేటాయించారు. పేపర్లో మూడు సెక్షన్‌లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో 30 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో పది ప్రశ్నలకు ఒక్కోదానికి ఒక మార్కు మిగిలిన 20 ప్రశ్నలకు ఒక్కోదానికి రెండు మార్కులు నిర్దేశించారు. రెండో సెక్షన్‌లో 10 మల్టిపుల్‌ సెలెక్ట్‌ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ ఒకటి లేదా అంత కంటే ఎక్కువ సమాధానాలు ఉంటాయి. వాటన్నింటినీ గుర్తించాలి. ప్రశ్నకు రెండు మార్కులు ప్రత్యేకించారు. మూడో సెక్షన్‌లో 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో పది ప్రశ్నలకు ఒక్కోదానికి ఒక మార్కు మిగిలిన పది ప్రశ్నలకు ఒక్కోదానికి రెండు మార్కులు ప్రత్యేకించారు. వీటికి ఆప్షన్స్‌ ఇవ్వరు. ఒక నెంబర్‌ను సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. మొదటి సెక్షన్‌లో మాత్రమే నెగెటివ్‌ మార్కులు వర్తిస్తాయి. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే కేటాయించిన మార్కుల్లో మూడోవంతు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. 

అర్హత: అభ్యర్థి జామ్‌లో ఎంచుకొన్న పేపర్‌/ పేపర్లను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్‌లతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు 2023 సెప్టెంబరు 29 నాటికి డిగ్రీ సర్టిఫికెట్‌లు సబ్మిట్‌ చేయాలి. అడ్మిషన్‌ సమయంలో నిర్దేశిత ప్రమాణాల మేరకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ తప్పనిసరి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులు ఒక పేపర్‌ మాత్రమే రాయాలంటే రూ.1800; రెండు పేపర్లు రాయాలంటే రూ.2500 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఒక పేపర్‌ రాయాలంటే రూ.900; రెండు పేపర్లు రాయాలంటే రూ.1250 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబరు 7 నుంచి

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 11

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, అమరావతి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ఎగ్జామ్‌ తేదీ: 2023 ఫిబ్రవరి 12

ఫలితాలు విడుదల: 2023 మార్చి 22న

అడ్మిషన్స్‌: 2023 ఏప్రిల్‌ 11 నుంచి 25 వరకు

వెబ్‌సైట్‌: https://jam.iitg.ac.in

Updated Date - 2022-08-11T21:02:32+05:30 IST