Abn logo
Sep 17 2021 @ 00:30AM

పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

నక్కపల్లి హైస్కూల్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న హెచ్‌ఎం రాణీలలిత

 

పాయకరావుపేట/నక్కపల్లి/ఎస్‌.రాయవరం/కోటవురట్ల, సెప్టెంబరు 16 : ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలకు గురువారం ఆయా ప్రధానోపాధ్యాయులు నోటిఫికేషన్లు విడుదల చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎంఈవో కేఎన్‌ గాంధీ మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీన స్వీకరించి, అదే  రోజు తుది జాబితాలు విడుదల చేస్తామన్నారు. 22వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికలు నిర్వహించి, మధ్యాహ్నం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారన్నారు. ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఓటరు, రేషన్‌ కార్డు, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు వంటి వాటిలో ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకు రావాలన్నారు. నక్కపల్లి హైస్కూల్‌లో నోటిఫికేషన్‌ విడుదల కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని రాణీలలిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, ఎస్‌.రాయవరం, కోటవురట్ల మం డలాల్లోని పాఠశాలల్లోనూ ఆయా ప్రధానోపాధాయయులు నోటిఫి కేషన్‌ను విడుదల చేశారు.