MID LEVEL HEALTH ప్రొవైడర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-04-07T17:18:44+05:30 IST

మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం వైద్య శాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న 24 గంటల విలేజ్‌ క్లినిక్‌ సబ్‌ సెంటర్లలో పనిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,755 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది...

MID LEVEL HEALTH ప్రొవైడర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

కలికిరి, చిత్తూరు, ఏప్రిల్‌ 6: మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం వైద్య శాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న 24 గంటల విలేజ్‌ క్లినిక్‌ సబ్‌ సెంటర్లలో పనిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,755 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. వాటిలో కడప జోన్‌-4 (పూర్వ కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలు)కు సంబంధించి 1,368 పోస్టులు కేటాయించారు. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించిన వారిని అర్హులుగా పేర్కొన్నారు. దీనికి తోడు సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీహెచ్‌ఎ్‌స) ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. కాగా.. హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టులకు ఏడాది కాల వ్యవధితో తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేస్తారు. బీఎస్సీ నర్సింగ్‌లో సాధించిన మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ ఉంటుంది. గురువారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలై ఈ నెల 16న ముగుస్తుంది. 20న ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా, 25న మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత 28 నుంచి 30 వరకూ కౌన్సెలింగ్‌ నిర్వహించి, అనంతరం నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

Updated Date - 2022-04-07T17:18:44+05:30 IST