CESSలో పీహెచ్‌డీ ప్రవేశానికి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-07-02T21:05:56+05:30 IST

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సెస్‌) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఇన్‌ డెవల్‌పమెంట్‌ స్టడీస్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌నకు నిజామాబాద్‌లోని

CESSలో పీహెచ్‌డీ ప్రవేశానికి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సెస్‌) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఇన్‌ డెవల్‌పమెంట్‌ స్టడీస్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌నకు నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ సహకారం అందిస్తోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్లు. మొదటి ఏడాది రెండు సెమిస్టర్లు ఉంటాయి. వీటిలో కోర్సు వర్క్‌లు ఉంటాయి. మొదటి సెమిస్టర్‌లో రిసెర్చ్‌ మెథడాలజీ, పరస్పెక్టివ్స్‌ అండ్‌ పారాడైమ్స్‌ ఆఫ్‌ డెవల్‌పమెంట్‌, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎకనామెట్రిక్స్‌/ డెవల్‌పమెంట్‌ స్టాటిస్టిక్స్‌ పేపర్లు;  రెండో సెమిస్టర్‌లో  ఇండియాస్‌ డెవల్‌పమెంట్‌ డిబేట్‌, అప్లయిడ్‌ ఎకనామెట్రిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌, పారాడైమ్స్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌ పేపర్లు ఉంటాయి. తరవాత నాలుగేళ్లపాటు రిసెర్చ్‌/ థీసిస్‌ వర్క్‌ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 12 సీట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. స్థానికేతరులకు హాస్టల్‌ సౌకర్యం ఉంది. 

విభాగాలు: ఎకనామిక్స్‌, సోషియాలజీ/ ఆంత్రోపాలజీ/ సోషల్‌ వర్క్‌, డెవల్‌పమెంట్‌ స్టాటిస్టిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ / పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, కామర్స్‌/ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ 


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ఎంఫిల్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్‌/ స్లెట్‌/ యూజీసీ ఎఫ్‌డీపీ / రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌ అర్హత పొంది ఉండాలి.   


ఎంపిక: దరఖాస్తులు పరిశీలించి అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది.  ఇందులో అర్హత పొందినవారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ స్కోర్‌కు 70 శాతం, ఇంటర్వ్యూ స్కోర్‌కు 30 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైదరాబాద్‌ మినహా ఇతర ప్రాంతాల నుంచి ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ట్రెయిన్‌/ బస్‌ ఫేర్‌ చెల్లిస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 30

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ సెంటర్‌: సెస్‌ క్యాంపస్‌, హైదరాబాద్‌

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: ఆగస్టు 13

 ఇంటర్వ్యూలు: ఆగస్టు 27న

ప్రోగ్రామ్‌ ప్రారంభం: సెప్టెంబరులో

దరఖాస్తు హార్డ్‌ కాపీ పంపాల్సిన చిరునామా: డీన్‌, డివిజన్‌ ఆఫ్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్‌, బేగంపేట్‌, హైదరాబాద్‌ - 500016.

వెబ్‌సైట్‌:  www.cess.ac.in

Updated Date - 2022-07-02T21:05:56+05:30 IST