నేడు తెనాలి డివిజన్‌ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-01-27T05:25:32+05:30 IST

జిల్లాలో తొలి దశకు సంబంధించి తెనాలి డివిజన్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం అధికారులు విడుదల చేయనున్నారు.

నేడు తెనాలి డివిజన్‌ నోటిఫికేషన్‌

జేసీలు దినేష్‌కుమార్‌, ప్రశాంతి సమీక్ష

నేడు గుంటూరులో అధికారులకు శిక్షణ


గుంటూరు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి దశకు సంబంధించి తెనాలి డివిజన్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం అధికారులు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై జేసీలు దినేష్‌కుమార్‌, ప్రశాంతి మంగళవారం రాత్రి డీపీవో కొండయ్యతో సమీక్షించారు.  నోటిఫికేషన్‌, నామినేషన్‌ పత్రాల స్వీకరణ తదితర అంశాలపై వారు చర్చించారు. తొలిదశ నోటిఫికేషన్‌ను బుధవారం కలెక్టరేట్‌లో ఎన్నికల ఇన్‌చార్జి దినేష్‌కుమార్‌ విడుదల చేయనున్నారు. తెనాలి డివిజన్‌లో 353 పంచాయతీలు ఉన్నాయి. అయితే వీటిల్లో 337 పంచాయతీలు, 3,442 వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించనున్నారు. పొన్నూరు, బాపట్ల మండలాల్లో 16 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. తెనాలి డివిజన్‌లో 160 కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్టేజ్‌ 1 అధికారులకు బుధవారం శిక్షణ ఇవ్వనున్నారు. స్టేజ్‌ 1 అధికారులకు, మైక్రో అబ్జర్వర్లకు, గుంటూరులో మొదటి దశలోను, రెండో దశలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో మండల కార్యాలయాల్లో రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణా తరగతులు ఉంటాయి. జడ్పీ సీఈవో, డీఎల్‌పీవోల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించారు. 

Updated Date - 2021-01-27T05:25:32+05:30 IST