TS News: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు?

ABN , First Publish Date - 2022-09-07T17:28:29+05:30 IST

బీజేఎల్పీ నేత ఈటల రాజేందర్‌ (Etela Rajender)పై సస్పెన్షన్ (Suspense) వేటుకు రంగం సిద్ధమైంది.

TS News: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై సస్పెన్షన్ వేటు?

హైదరాబాద్ (Hyderabad): బీజేఎల్పీ నేత ఈటల రాజేందర్‌ (Etela Rajender)పై  సస్పెన్షన్ (suspension) వేటుకు రంగం సిద్ధమైంది. వర్షాకాల సమావేశాల నుంచి ఈటలను సస్పెండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈటలకు స్పీకర్ కార్యాలయం (Speaker office) నోటీసులు (Notices) జారీ చేసినట్టు సమాచారం. సభాపతి మరమనిషిలా వ్యవహరిస్తున్నారని నిన్న ఈటల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారని విమర్శించారు. బీఏసీ (BAC) సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను (BJP MLAs) ఆహ్వానించకపోవడం దారుణమని అన్నారు.


ఈటల రాజేందర్ కామెంట్స్‌ను స్పీకర్ కార్యాలయం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరమనిషి వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈటలకు స్పీకర్ కార్యాయం నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నోటీసులకు వివరణ ఇచ్చిన తర్వాత స్పీకర్ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని సమాచారం. కాగా ఈనెల 12, 13 తేదీల్లోజరిగే వర్షాకాల సమావేశాల్లో ఈటల రాజేందర్ పాల్గొనకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. సస్పెన్షన్ కోసమే నోటీసులు జారీ చేశారని అన్నారు.


నిన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

స్పీకర్ ఒక మర మనిషిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం చెప్పింది చేయడం తప్పా.. స్పీకర్‌‌ పోచారానికి (Speaker Pocharam) వేరే పని లేదన్నారు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Government) సభ సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందన్నారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నయంటే తమ సమస్యలు ప్రస్తావించమని పలు రంగాల వారు విన్నవించుకునే పద్ధతి ఉండేదని ఈటల పేర్కొన్నారు.


ఉమ్మడి ఏపీలో 80, 90 రోజులు సమావేశాలు జరిగేవన్నారు. బడ్జెట్ సమావేశాలు(Budget meeting) 40 నుంచి 45 రోజులు కొనసాగేవన్నారు. గత సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి అకారణంగా, అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని వీఆర్ఏ(VRA), వీఆర్ఓ(VRO), గిరిజనులు అడుగుతున్నారని ఈటల పేర్కొన్నారు. భూములు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం భూములు లాక్కొని ల్యాండ్ బ్రోకర్‌గా మారిందన్నారు. జీతాలు సమయానికి రాక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజల సమస్యలు చర్చించాల్సిన అసెంబ్లీ కేవలం 5 నిమిషాలే సాగిందన్నారు. ఇక్కడ సీఏం తప్పించుకోవచ్చు గానీ, ప్రజల చేతిలో ప్రభుత్వానికి శిక్ష తప్పదన్నారు. అవకాశం వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడుతామన్నారు. లేదంటే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని ఈటల పేర్కొన్నారు.

Updated Date - 2022-09-07T17:28:29+05:30 IST