Abn logo
Jan 14 2021 @ 03:12AM

జగన్‌కు నోటీసు ఇవ్వాలి: డీజీపీకి వర్ల లేఖ

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేస్తున్న వారు తనకు తెలుసని చెప్పిన సీఎం జగన్‌కు అండర్‌ సెక్షన్‌ 91 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చి, దేవాలయాలపై దాడులు చేస్తుందెవరో  సమాచారం రాబట్టాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం డీజీపీకి ఆయన లేఖ రాశారు. రథాలు తగలబెట్టిన వారే రథయాత్రలు చేస్తున్నారని ‘అమ్మ ఒడి’ సభలో జగన్‌ ఉద్ఘాటించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. గతంలో ఒక కేసులో చంద్రబాబుకు, తనకు సెక్షన్‌ 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మాజీ సీఎంకు నోటీసు ఇచ్చినట్లే, ప్రస్తుత సీఎంకూ నోటీసు ఇవ్వాలని వర్ల అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement