Abn logo
May 12 2020 @ 09:01AM

మహిళకు అసభ్య వీడియోలు.. నోటీసులు జారీ

Kaakateeya

హైదరాబాద్ : మహిళకు అసభ్య వీడియోలు పంపిన వ్యక్తికి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీచేశారు. బేగంపేట ప్రాంతానికి చెందిన మహిళకు మే 6న కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి రవిప్రసాద్‌ ఫోన్‌ నుంచి 2 అసభ్య వీడియోలు వచ్చాయి. కొద్ది సేపటికే వీడియోలను డిలీట్‌ చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి రవిప్రసాద్‌కు నోటీసులు జారీ చేసి అతడి నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement