Abn logo
Sep 22 2021 @ 01:30AM

కలిసి పనిచేస్తే సాధించలేనిది లేదు

శంకుస్థాపన చేస్తున్న స్పీకర్‌ పోచారం

శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

బాన్సువాడ, సెప్టెంబరు 21: ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేస్తే సాధింలేనిది ఏమీ లేదని స్పీక ర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని 5వ వార్డు కాలనీ లో రూ.20 లక్షలతో నూతనం గా టీఎన్జీవోస్‌ భవనానికి శంకు స్థాపన చేశారు. అలాగే ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో 59 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా స్పీకర్‌ మాట్లా డుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో టీఎన్జీవోస్‌ ఉద్యోగుల పాత్ర మరువ లేనిదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ ఉందన్నారు. రాష్ట్రంలో 42లక్షల మందికి రూ.12 వేల కోట్ల ఆసరా పెన్షన్లు అందు తున్నాయని, దాని వెనుక ఉద్యోగుల కృషి ఉందన్నారు. అలాగే మిషన్‌ భగీరథ పథకం ద్వారా కోటి కుటుంబాలకు తాగునీరు అందుతున్నాయంటే ఇంజినీర్లు, ఉద్యోగుల కృషి ఎంతగానో ఉందన్నారు. 24గంటల కరెంట్‌ విసయం వెనుక ఉద్యో గుల కృషి ఉందన్నారు. మెజార్టీ కేంద్ర మంత్రులు, ఢిల్లీ నుంచి రాష్ర్టానికి విచ్చేసి  రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పాలన మెరుగ్గా జరగడా నికి పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్తున్న ఉద్యోగులందరికీ ధన్యవాదాలన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, రాజకీయ వేదిక పవిత్రమైందన్నారు. 44 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, నాటి నుంచి నేటి వరకు హుందాతనంతోనే ఉన్నా మన్నారు. చిల్లర రాజకీయాలు ఏనాడూ చేయలేదని, వేరే వాళ్లను తిడితే పేరు రాదు, సహాయం చేస్తే పేరు వస్తుందన్నారు. అందరి ముఖంలో నవ్వు చూడటమే సీఎం కేసీఆర్‌ ఉద్దేశమన్నారు.  ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, టీఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిల్ల రాజేందర్‌, ప్రతాప్‌, అలుక కిషన్‌, నరాల వెంకట్‌ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ పాత బాలకృష్ణ, సొసైటీ చైర్మన్లు ఎర్వల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్‌, నాయకులు వెంకట్రాం రెడ్డి, ఎజాజ్‌, గురు వినయ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.