సివిల్‌ కోర్టులో కేసులుంటే ఏమీ చేయలేం

ABN , First Publish Date - 2021-10-19T05:16:49+05:30 IST

భూ ములకు సంబంధించిన తగాదాలు సివిల్‌ కోర్టులో ఉన్నప్పుడు మేము ఎలాంటి చర్యలు తీసుకోలే మని, కోర్టు తీర్పు అనంతరమే, సంబంధిత సమ స్యలను పరిష్కరించేందుకు వీలు ఉంటుందని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు స్పష్టం చేశారు.

సివిల్‌ కోర్టులో కేసులుంటే ఏమీ చేయలేం
ధరణి కార్యక్రమంలో మహిళ నుంచి సమస్యను తెలుసుకుంటున్న కలెక్టర్‌

- కోర్టు తీర్పు మేరకే సమస్యల పరిష్కారానికి చర్యలు

- ‘ధరణి’ ఫిర్యాదులను మొదట మీసేవలో నమోదు చేసుకోవాలి

- ఇకపై మండల స్థాయిలో కూడా ప్రత్యేక ప్రజావాణి  

- ధరణి గ్రీవెన్సులో కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 18: భూ ములకు సంబంధించిన తగాదాలు సివిల్‌ కోర్టులో ఉన్నప్పుడు మేము ఎలాంటి చర్యలు తీసుకోలే మని, కోర్టు తీర్పు అనంతరమే, సంబంధిత సమ స్యలను పరిష్కరించేందుకు వీలు ఉంటుందని   కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు స్పష్టం చేశారు. సోమవా రం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ధరణి గ్రీవెన్సు కేంద్రంలో 38దరఖాస్తులు, రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో 26 సాధారణ ఫిర్యాదులను కలెక్టర్‌ స్వీక రించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌కు ఇప్పటివరకు 21వేల దరఖాస్తులు రాగా, 92శాతం పరిష్కరించామన్నారు.  మిగితావి  ఈ వారంలో పరిష్కరించనున్నట్లు చెప్పారు.  ఈ ప్రత్యేక సెల్‌ను మరో నాలుగు వారాలు నిర్వహిం చనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అలాగే ప్రెమిసెస్‌లో మీసేవ కేంద్రాని కూడా ఏర్పాటు చేశామన్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ఇకపై మండల స్థాయిలో కూడా ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.   ఫిర్యా దులను మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెవె న్యూ అదనపు కలెక్టర్‌ సీతారామారావు, ఆర్‌డీవో పద్మశ్రీ, మండలాల డీటీలు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:16:49+05:30 IST