సెలబ్రేషన్లకు సమయం కాదిది.. మోదీ పర్యటనపై అఖిలేష్

ABN , First Publish Date - 2021-10-05T17:08:55+05:30 IST

లఖింపూర్ కేరి హింసాత్మక ఘటనతో ఉత్తరప్రదేశ్ విషాదంలో మునిగిపోయిందని, ఇది సెలబ్రేషన్లు జరుపుకునే సమయం..

సెలబ్రేషన్లకు సమయం కాదిది.. మోదీ పర్యటనపై అఖిలేష్

న్యూఢిల్లీ: లఖింపూర్ కేరి హింసాత్మక ఘటనతో ఉత్తరప్రదేశ్ విషాదంలో మునిగిపోయిందని, ఇది సెలబ్రేషన్లు జరుపుకునే సమయం కాదని సమాజ్‌‍వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారంనాడు లక్నోలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ మంగళవారంనాడు ప్రారంభించాల్సి ఉంది. ప్రధాని రాకను దృష్టిలో ఉంచుకుని అఖిలేష్ యాదవ్ తాజా ట్వీట్ చేశారు. రైతులను కోల్పోయిన విషాదంలో యూపీ ఉందని, సెలబ్రేషన్లు జరుపుకునేందు ఇదెంత మాత్రం సమయం కాదని ఆయన అన్నారు.


ప్రధాని మోదీ లక్నోలో జరిగే ఆజాదీ@75-న్యూ అర్బన్ ఇండియా ఎక్స్‌పోలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో 74 అర్బన్ డవలప్‌మెంట్ ప్రాజెక్టులకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరుకానున్నారు.

Updated Date - 2021-10-05T17:08:55+05:30 IST