సమస్యలు పరిష్కరించడం లేదు

ABN , First Publish Date - 2022-05-24T05:47:24+05:30 IST

సమస్యలు పరిష్కరించడం లేదు

సమస్యలు పరిష్కరించడం లేదు
సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్లు

శంషాబాద్‌, మే 23: వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని శంషాబాద్‌ మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. ఈమేరకు సోమవారం శంషాబాద్‌ మండలపరిషత్‌ సమావేశ మందిరంలో జరుగనున్న మున్సిపల్‌ కార్యవర్గ సమావేశాన్ని పలువురు కౌన్సిలర్లు బహిష్కరించారు. అనంతరం శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్లు అయిల్‌ కుమార్‌, అజయ్‌, బద్రు, సునీత, విజయలక్ష్మి, నజీయాబేగంలు మాట్లాడారు. డ్రైనేజీ వ్యవస్థ పాడైందని చెప్పినా కమిషనర్‌ సాబేర్‌అలీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. సొంతడబ్బులు ఖర్చుచేసి పనులు  చేయించాల్సి వస్తుందన్నారు.  అదేవిధంగా మున్సిపల్‌ కార్యాలయం నుంచి బస్టాండుకు వెళ్లే రోడ్డు పనులు రెండు సంవత్సరాలుగా జరుగుతున్నా ఇంకా పూర్తికాక ప్రజలు ఇబ్బందులు పడున్నారని తెలిపారు. ఇప్పటికైనా సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. 

గుట్టుగా రూ.22కోట్ల పనులకు ఆమోదం

పలువురు కౌన్సిలర్లు కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరించినా కొత్తచట్టప్రకారం ఏడుగురు కౌన్సిలర్లు హాజరైతే సమావేశం నిర్వహించే అవకాశం ఉండడంతో మండల పరిషత్‌ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశాన్ని కొనసాగించారు. ఈ సమావేశానికి 9మంది కౌన్సిలర్లు హాజరైనట్లు తెలుస్తోంది. పలువురు కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి వెల్లిపోయినా మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించారు. పనిలోపనిగా రూ.22కోట్లతో చేపట్టే పనులకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈకార్యవర్గం వచ్చినప్పటి నుంచి కౌన్సిల్‌ సమావేశాలకు మీడియాను అనుమతించడంలేదు. 

Updated Date - 2022-05-24T05:47:24+05:30 IST