పనిచేయకపోతే అవసరం లేదు

ABN , First Publish Date - 2021-10-19T06:28:59+05:30 IST

నిబంధనల ప్రకారం పనిచేయకపోతే జిల్లాలో మీసేవలు అవసరం లేదని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను హెచ్చరించారు.

పనిచేయకపోతే అవసరం లేదు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

మండల స్థాయి అధికారులను హెచ్చరించిన కలెక్టర్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), అక్టోబరు 18 : నిబంధనల ప్రకారం పనిచేయకపోతే జిల్లాలో మీసేవలు అవసరం లేదని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను హెచ్చరించారు. సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వీఆర్వోలు చేసిన తప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని తెలిపారు. బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా వారి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ప్రజా సేవకు లమనే విషయాన్ని అధికారులు విస్మరించరాదన్నారు. మీసేవ, స్పందన లో వచ్చే అర్జీల పరిష్కారానికి వారంలో ఒక గంట కేటాయించలేరా? అని ప్రశ్నించారు. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడంతోనే సమస్యలు తగ్గడం లేదన్నారు. జిల్లాలో పనిచేయడం ఇష్టం లేదా.. అంటూ రెవెన్యూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం కార్డులు, పింఛన్ల సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీలు వెంకటమురళి, టీఎస్‌ చేతన్‌, కేఎస్‌ విశ్వనాఽథన్‌, కృష్ణవేణి, డీఆర్వో సరళావందనం, అధికారులు దేవానందరెడ్డి, సాయినాఽథ్‌కుమార్‌, బాబూరావు, శీనారెడ్డి, కొండయ్య, సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు. 





Updated Date - 2021-10-19T06:28:59+05:30 IST