రోగులకు సరైన వైద్యం అందించడం లేదు

ABN , First Publish Date - 2022-05-28T05:29:56+05:30 IST

రోగులకు సరైన వైద్యం అందించడంలో వైద్యాధికారి ఇందిర విఫలమైందని సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోగులకు సరైన వైద్యం అందించడం లేదు
సర్వసభ్య సమావేశంలో డాక్టర్‌ ఇందరపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సభ్యురాలు

సమయపాలన పాటించని వైద్యాధికారి

కల్యాణలక్ష్మి సంతకాల కోసం ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా?

సర్వ సభ్య సమావేశంలో అధికారులపై సభ్యుల ఆగ్రహం

టేక్మాల్‌ మే 27: రోగులకు సరైన వైద్యం అందించడంలో వైద్యాధికారి ఇందిర విఫలమైందని సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయ సర్వసభ్య సమావేశనికి ఎంపీపీ చింత స్వప్నారవి అధ్యక్షతన నిర్వహించరు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ ఇందిర అందుబాటులో ఉండకపోవడంతో గర్భిణులు, బాలింతలు అవస్థలు పడుతున్నారని, సాధారణ రోగులకు కూడా వైద్యం అందించలేక పోతున్నారని టేక్మాల్‌ సర్పంచ్‌ సుప్రజాభాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు రకాల జబ్బులతో వచ్చే రోగులకు కనీసం ఇంజక్షన్లు ఇవ్వలేని పరిస్థిత్తుల్లో వైద్య సిబ్బంది ఉన్నారని ఎద్దేవా చేశారు. ఫార్మసిస్టు అందుబాటులో లేకపోవడంతో మాత్రలు, సిర్‌ఫలు సరైన మందులు రోగులకు అందివ్వడం లేదన్నారు. కల్యాణలక్ష్మీ చెక్కుల సంతకాల కోసం ఎమ్మెల్యే వద్దకు లబ్ధిదారులు వెళ్లేందుకు ఏమైనా జీవో ఉన్నదా? అని ఎంిపీటీసీ వాణి, తహసీల్దార్‌ మధుసూదన్‌ను ప్రశ్నించారు. పాతపద్ధతిలోనే సంతకాలను చేయించాలని ఆమె కోరారు. మిషన్‌ భగీరథ నీళ్లు మురికిగా వస్తున్నాయని, మురుగునీరు అందులో కలిసి కలుషితమవుతున్నాయన్నారు. వర్షాకాలం రాకముందే వీటిని బాగు చేసి స్వచ్ఛమైన నీటిని అందించే బాధ్యత మిషన్‌ భగీరథ అధికారులపై ఉందనీ మండల కో-అప్షన్‌ సభ్యులు మేజర్‌ అన్నారు. ఐసీడీఎస్‌ అధికారులు పర్యవేక్షణ లోపం మూలంగానే అంగన్‌వాడీ సెంటర్‌లో, మినీ అంగన్‌వాడీ సెంటర్లను సక్రమంగా నిర్వహించడం లేదన్నారు.  పిల్లలు నష్టపోతున్నారని, బాలింతలు, గర్భిణులకు కూడా పోషకాహార లోపం ఉందని వెంకటాపూర్‌ సర్పంచ్‌ లచ్చాగౌడ్‌ అన్నారు. వర్షాకాలం కావడంతో చెరువులు కుంటల నుంచి నీటి ప్రవాహం ఉంటుందని చెరువులు, కుంటల మరమ్మతులు చేపట్టకపోవడంతో నీరు వృథాగా పోతుందని టేక్మాల్‌ సర్పంచ్‌ భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మంజుల, జిల్లా కో ఆప్షన్‌ సభ్యులు యూసుఫ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ యశ్వంత్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-28T05:29:56+05:30 IST