Abn logo
Jul 31 2021 @ 20:25PM

నాకు ఎమ్మెల్యే కావాలి.. మహిళ సరదా కామెంట్, ఎమ్మెల్యే రెస్పాన్స్ వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: రాజకీయ నేతలు, సీనీతారలు, ఇతర సెలెబ్రిటీలకు అభిమానులు ఉండటం సహజమే. సోషల్ మీడియాలో వారు తరచూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. కొందరు సరదా కామెంట్లతో తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తుంటారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దాపై ఓ మహిళ ఇలాగే తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఓ సరదా కామెంట్ చేశారు. ఈ కామెంట్, దానిపై ఎమ్మెల్యే రెస్పాన్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌(ఆమ్ ఆద్మీ పార్టీ)కు ఓటు వేయాలని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అభ్యర్ధించారు. పంజాబ్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న పార్టీ వాగ్దానాన్ని కూడా ప్రస్తావించారు. దీనిపై ఓ మహిళ సరదాగా స్పందించారు. ‘‘నాకు ఉచిత విద్యుత్ వద్దు.. రాఘవ్ కావాలి’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే..ఈ కామెంట్‌పై ఎమ్మెల్యే కూడా అంతే సరదాగా స్పందించారు. ‘‘పార్టీ మేనిఫెస్టోలో నేను లేను. కానీ ఉచిత విద్యుత్ ఉంది. ఆప్‌కు ఓటెయ్యండి..మీకు ఉచిత విద్యుత్ అందుతుందని నేను మాటిస్తున్నా. అయితే..నా విషయంలో మాత్రం ఈ హామీ ఇవ్వలేను’’ అని రిప్లై ఇచ్చారు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా.. ఢిల్లీలోని రాజిందర్ నగర్ నియోజకవర్గానికి రాఘవ్ ఛద్దా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...