‘ఆహార సరఫరాపై కరోనా ప్రభావం లేదు’.. ప్రపంచ ఆహార సంస్థ వెల్లడి

ABN , First Publish Date - 2020-04-05T01:37:44+05:30 IST

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి.. ఆహార సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రపంచ ఆహార సంస్థ(డబ్ల్యూఎఫ్‌పీ) వెల్లడించింది.

‘ఆహార సరఫరాపై కరోనా ప్రభావం లేదు’.. ప్రపంచ ఆహార సంస్థ వెల్లడి

రోమ్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి.. ఆహార సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రపంచ ఆహార సంస్థ(డబ్ల్యూఎఫ్‌పీ) వెల్లడించింది. ఐక్యరాజ్యసమితిలో భాగమైన ఈ సంస్థ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం కరోనా విజృంభణ ఇంతలా ఉన్నా ప్రంపంచ, ఆహార సరఫరాపై మాత్రం ఇప్పటివరకు దాని ప్రభావం చాలా తక్కువేనని తెలుస్తోంది. కానీ ఈ పరిస్థితి ఇలానే కొనగాగకపోవచ్చని డబ్ల్యూఎఫ్‌పీ అభిప్రాయపడింది. ఎక్కువగా దిగుమతులు చేసుకునే దేశాలు గనుక భయపడి, విపరీతంగా కొనుగోళ్లు చేస్తే ఆహార సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. మార్కెట్లు, ఆహార ఉత్పత్తుల ధరలు నియంత్రిస్తూ, పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తుంటే భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Updated Date - 2020-04-05T01:37:44+05:30 IST