Abn logo
Aug 15 2020 @ 18:55PM

బీజేపీ టికెట్ ఇస్తానంది.. ఆసక్తి లేక వదిలేశా: కంగన

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రాజకీయ అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె బీజేపీలో చేరాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని మోదీకి మద్దతిస్తోందంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో కంగన స్పందించారు. ‘మణికర్ణిక సినిమా తర్వాత బీజేపీ నుంచి నాకు టికెట్ ఇస్తామన్నారు. కానీ నాకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తిలేదు. నా దృష్టంతా సినిమాలపైనే. నటిగా నా జీవితం గురించే ఆలోచిస్తున్నానేగానీ, రాజకీయాల గురించి అసలు ఆలోచన లేదు’ అని ఆమె తేల్చిచెప్పారు. ఇకనైనా తనపై ట్రోలింగ్ ఆపాలని నెటిజన్లకు సూచించారు.

Advertisement
Advertisement
Advertisement