ఢిల్లీలో కాదు.. సొంత నియోజకవర్గంలోని రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-05-25T05:24:02+05:30 IST

ఢిల్లీలో రైతు ఉద్యమంలో పాల్గొని మృతిచెందిన రైతులను ఆదుకోవడంలో తప్పులేదు కానీ, సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో అప్పులబాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను కూడా ఆదుకోవాలని కాంగ్రెస్‌ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఢిల్లీలో కాదు.. సొంత నియోజకవర్గంలోని రైతులను ఆదుకోవాలి
రాయవరంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్న నర్సారెడ్డి

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి

జగదేవ్‌పూర్‌, మే 24: ఢిల్లీలో రైతు ఉద్యమంలో పాల్గొని మృతిచెందిన రైతులను ఆదుకోవడంలో తప్పులేదు కానీ, సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గంలో అప్పులబాధతో  ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను కూడా ఆదుకోవాలని కాంగ్రెస్‌ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి డిమాండ్‌ చేశారు. జగదేవ్‌పూర్‌ మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన దబ్బెట మల్లేశం అనే రైతు నాలుగురోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, మృతుని కుటుంబసభ్యులను మంగళవారం నర్సారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేసి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఒక గజ్వేల్‌లోనే పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు జరిగాయని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.  రైతులు అప్పులు పెరిగాయని అధైర్య పడి క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆయనవెంట కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, యాదగిరి ఉన్నారు. 

Updated Date - 2022-05-25T05:24:02+05:30 IST