గీతతో అంత వీజీ కాదు!

ABN , First Publish Date - 2020-09-14T10:23:39+05:30 IST

గీతతో అంత వీజీ కాదు!

గీతతో అంత వీజీ కాదు!

తప్పడానికి సరిపడా అంచనాలుంటాయి.

అత్యాశగా నిరూపితం కాబోయే ఆలోచనలుంటాయి.

కరిగిపోవటానికి సంసిద్ధంగా కలలుంటాయి.

దాటడానికి సవాలక్ష అభ్యంతరాలున్న అంతరాలుంటాయి.

వేగంగా రంగులు వెలిసిపోవటానికి ముస్తాబైన రాజుగారి మేడలుంటాయి.

ఉసూరుమనటానికి ఉబికివచ్చే ఊహల సౌధాలుంటాయి.

నిజాల చేదు తెలియంది కాదు.

కుంపటిలో నిప్పుల గురించిన ఎరుక ఎక్కడకూ పారిపోదు.

అయినా ఆశ అమాయక చక్రవర్తి.

ఆకాశంపైనే దాని దృష్టి.

ఏం పరవాలేదు.

ఆల్‌ దట్‌ గ్లిట్టర్స్‌ దూరం నుండి నునుపనే సామెత

అందుబాటులో వుంటుంది.

ఫెమిలియారిటీ బ్రీడ్స్‌ వర్జ్యయేత్‌ అనే ప్రోవర్బ్‌ దానితో పోటీకొస్తుంది.


ఫోటోఫ్రేములో జరిగినంత సులభం కాదు...

మనుషులు దగ్గరవ్వటం!


-మోహన్‌ రుషి

96768 93149

Updated Date - 2020-09-14T10:23:39+05:30 IST