కోట్లు సంపాదించడం కాదు.. పేదలకు సాయం చేయాలి

ABN , First Publish Date - 2022-05-26T05:30:00+05:30 IST

కోట్లు సంపాదించడం కాదు.. పేదలకు సాయం చేయాలి

కోట్లు సంపాదించడం కాదు.. పేదలకు సాయం చేయాలి
ఎల్లమ్మ ఇంటి పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న వజ్రే్‌షయాదవ్‌, నాయకులు

  • కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ వజ్రే్‌షయాదవ్‌  
  • కుమ్మరి ఎల్లమ్మ ఇంటి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

మేడ్చల్‌ అర్బన్‌, మే 26 : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌, మంత్రి మల్లారెడ్డిలు కోట్లు సంపాదిస్తున్నారని, దోచుకోవడం, సంపాదించడం కాకుండా.. పేదలకు సాయం చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ తోటకూర వజ్రే్‌షయాదవ్‌ ధ్వజమెత్తారు. ఈ నెల 23న మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై పెద్దఎత్తున రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన రేవంత్‌రెడ్డి ముందుగా.. ఆర్‌అండ్‌బీ చేపట్టిన రోడ్డు విస్తరణలో సగం ఇల్లు కోల్పోయి, ఆరేళ్లుగా శిథిలావస్తలో ఉన్న ఇంట్లోనే నివాసముంటున్న వృద్దురాలు కుమ్మరి ఎల్లమ్మ ఇంటికి రేవంత్‌రెడ్డి వెళ్లి పరమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అధికారులు తనకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు ఇస్తామని వాగ్ధానం చేసి.. రోడ్డు విస్తరణలో ఇంటిని కూల్చివేసి ఆరేళ్లయిందని.. ఇప్పటివరకూ పట్టించుకున్నవారే లేరని ఎల్లమ్మ రేవంత్‌రెడ్డిఎదుట తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో రేవంత్‌రెడ్డి రచ్చబండలో మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన కుమ్మరి ఎల్లమ్మకు రూ.5 లక్షలు వెచ్చించి, కాంగ్రెస్‌ నాయకులు హరివర్ధన్‌రెడ్డి, వజ్రే్‌షయాదవ్‌లు ఇంటిని పునర్నిర్మిస్తారని హామీ ఇచ్చారు. దీంతో వజ్రే్‌షయాదవ్‌ లక్ష్మాపూర్‌కు విచ్చేసి శిథిలావస్థలో ఉన్న ఎల్లమ్మ పాత ఇంటిని జేసీబీలతో కూల్చివేయించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింలు, ఉప సర్పంచ్‌ వైధ్యనాథ్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ముజీబ్‌, మాజీ సర్పంచ్‌ జగన్నాథం, మండల కాంగ్రెస్‌ నాయకులు మహేందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, నర్సింలు, తదితరు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T05:30:00+05:30 IST