చేయూత కాదు.. ఎగవేత

ABN , First Publish Date - 2020-08-15T09:10:17+05:30 IST

ఎన్నికల ప్రచారంలో 45 ఏళ్లు నిండిన బీసీ అక్కాచెల్లెళ్లకు రూ.3వేలు ఫించన్‌ ఇస్తామని నమ్మబలికిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట తప్పి బలహీనవ

చేయూత కాదు.. ఎగవేత

 టీడీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిరాల 


గుంటూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో 45 ఏళ్లు నిండిన బీసీ అక్కాచెల్లెళ్లకు రూ.3వేలు ఫించన్‌ ఇస్తామని నమ్మబలికిన జగన్‌ అధికారంలోకి వచ్చాక మాట తప్పి బలహీనవర్గాల మహిళలను మోసం చేశారని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్‌ విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.


వైఎస్సార్‌ చేయూత పేరుతో కేవలం రూ.18,750 చొప్పున చెల్లించి చేతులు దులుపుకోవటం దారుణమన్నారు. ఈ నిర్ణయం వల్ల ఒక్కో బీసీ మహిళకు ఐదేళ్లలో రూ.లక్షా 5వేలు నష్టపోయారని తెలిపారు. అందుకే అది చేయూత కాదు ఎగవేత అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో డ్వాక్రా మహిళలకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన మాట నిజం కాదా అని నిలదీశారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామని.. నమ్మబలికి బ్యాంకులకు వడ్డీలను కట్టిస్తూ డ్వాక్రా సంఘాలను నిద్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-08-15T09:10:17+05:30 IST