Abn logo
Jul 15 2020 @ 23:36PM

కరెక్ట్‌ కాదు!

తొమ్మిది కథలను, ఒక్కో కథను ఒక్కో దర్శకుడి చేతిలో పెడుతూ... తొమ్మిది మంది దర్శకులతో మద్రాస్‌ టాకీస్‌ పతాకంపై మణిరత్నం నిర్మించబోయే వెబ్‌ యాంథాలజీ (పలు కథల సంకలనం) ‘నవరస’లో తమిళ స్టార్‌ హీరో సూర్య ఓ కథలో నటించనున్నారనీ, దానికి జయేంద్ర దర్శకత్వం వహించనున్నారనీ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, అది అవాస్తవమని జయేంద్ర పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఏదీ స్పష్టంగా చెప్పలేను. వారం, పది రోజుల్లో వివరాలు వెల్లడించగలను. అయితే, ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వార్తలు మాత్రం కరెక్ట్‌ కాదు’’ అని జయేంద్ర తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement