ప్రగల్బాలు కాదు.. పరిహారం ఇవ్వండి: బీసీ

ABN , First Publish Date - 2021-11-27T04:36:09+05:30 IST

ఆర్భాటంగా ప్రగల్బాలు పలకడం కాదు, పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రగల్బాలు కాదు.. పరిహారం ఇవ్వండి: బీసీ

సంజామల, నవంబరు 26: ఆర్భాటంగా ప్రగల్బాలు పలకడం కాదు, పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని పేరుసోముల గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మిరప, శనగ పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీసీ మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు నష్టపోయి రైతులు భారీగా దెబ్బతిన్నారన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఈ-క్రాఫ్‌ బుకింగ్‌ లేకపోయినా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌బీకే కేంద్రాలు కేవలం వైసీపీ కార్యకర్తలకే సేవలందిస్తున్నాయని విమర్శించారు. నెల రోజుల్లోపు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.40 వేల పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు సున్నావడ్డీ కూడా అన్ని బ్యాంకుల్లో వర్తించడం లేదని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అవి ప్రభుత్వం చేసిన హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఆర్‌బీకే సిబ్బంది పూర్తి స్థాయిలో ఫీల్డుకు రావడం లేదని, జిరాక్స్‌ కాపీలకే పరిమితం అయ్యారన్నారు. ఈ-క్రాఫ్‌ పేరుతో రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బెలుం సురే్‌షరెడ్డి, మంచాల మద్దిలేటిరెడ్డి, శంకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎల్లా శ్రీనివాసులు, తులసిరెడ్డి, మంచాల ప్రతా్‌పరెడ్డి, చెన్నారెడ్డి, కత్తి రామదాసు, శివరామిరెడ్డి, శివారెడ్డి, బండి ప్రతా్‌పరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సూరి, వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-11-27T04:36:09+05:30 IST