‘బండి’ కాదు మొండి!

ABN , First Publish Date - 2021-02-26T06:50:55+05:30 IST

సీఎం జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలులోకి తెచ్చిన ఇంటింటికీ రేషన పంపిణీ పథకం మూణ్ణాళ్ల ముచ్చట కానుంది. ప్రభుత్వం బియ్యం పంపిణీ కోసం పంపిణీ చేసిన వాహనాలు నిర్వహణ కష్టసాధ్యం కావడంతో వాటిని పొందిన లబ్ధిదారులు ఎక్కడికక్కడే ప్రభుత్వ కార్యాలయాలకు వాటిని అప్పగించి నిరసన తెలి యజేస్తున్నారు.

‘బండి’ కాదు మొండి!
అంబాజీపేట మండల పరిషత ఆఫీసు వద్ద రేషన్‌ వాహనాలను అప్పగింత (ఫైల్‌)

  • ఎక్కడికక్కడే ఎండీయూ వాహనాలు నిలిపివేత
  • రేషన పంపిణీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్న నిర్వాహకులు
  • మొన్న అనపర్తి.. తాజాగా అంబాజీపేట..అందని రేషన

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

సీఎం జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలులోకి తెచ్చిన ఇంటింటికీ రేషన పంపిణీ పథకం మూణ్ణాళ్ల ముచ్చట కానుంది. ప్రభుత్వం బియ్యం పంపిణీ కోసం పంపిణీ చేసిన వాహనాలు నిర్వహణ కష్టసాధ్యం కావడంతో వాటిని పొందిన లబ్ధిదారులు ఎక్కడికక్కడే ప్రభుత్వ కార్యాలయాలకు వాటిని అప్పగించి నిరసన తెలి యజేస్తున్నారు. రాజమహేంద్రవరం, అనపర్తి, అంబాజీపేటలలో మొబైల్‌ డిస్పెన్సరింగ్‌ వాహనాలను(ఎండీయూ) ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేసి నిర్వాహకులు నిరసన వ్యక్తంచేశారు. అంబాజీపేట మండల పరిధిలో రేషన పంపిణీ కోసం కేటాయించిన తొమ్మిది ఎండీయూ వాహనాలను బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద పెట్టి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌, ఎంపీడీవోలకు అందజేశారు. దీంతో ఆయా మండలాల పరిధిలో వేల సంఖ్యలో ఉన్న లబ్ధిదారులకు నేటికీ రేషన అందని పరిస్థితి. జిల్లాలో ఇంటింటికీ రేషన పంపిణీ కోసం ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభు త్వం అట్టహాసంగా ఎండీయూ వాహనాల ద్వారా రేషన పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో 2658 చౌకదుకాణాల పరిధిలో 16.28 లక్షల కార్డులు కలిగిన లబ్ధిదారులకు బియ్యంతో సహా ఇతర నిత్యావసర వస్తువులను ఇంటింటికీ పంపిణీ చేసేందుకు 1078 వాహనాలను సమకూర్చారు. మండలానికి 10 నుంచి 12 వాహనాల వరకు కేటాయించి వారికి ఆయా గ్రామాల పరిధిలో రేషనకార్డుల జాబితాతో మ్యాపింగ్‌ చేశారు. ఉదాహ రణకు అంబాజీపేట మండలంలో 19675 రేషనకార్డులున్నాయి. ఇందుకోసం 9 వాహ నాలు కేటాయించారు. రోజుకు 80 నుంచి 100 మంది కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. రేషనకార్డుదారుల ఈ-పాస్‌ సక్రమంగా పడకపోవడం, నెట్‌ సిగ్నల్‌ లేకపోవడం వంటి సమస్యలతోపాటు రేషనకార్డుల లబ్ధిదారులు సహకరించకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చౌకడిపో నుంచి బస్తాలు మోసుకెళ్లడం, సహా యకునిగా రోజుకు రూ.500 జీతంతో కూలీని నియమించుకోవడం, వలంటీర్ల సహ కారం అంతంతమాత్రంగానే అందిస్తుండడం వంటి సమస్యలతో ఇంటింటికీ రేషన పంపిణీ పథకం ముందుకు కదలడంలేదు. ఇందుకోసం వాహనదారునికి ప్రభుత్వం చెల్లిస్తున్న సొమ్ములు రూ.35 వేలకు పెంచితే తప్ప నిర్వహణ సాధ్యం కాదని తేల్చిచెప్పేస్తున్నారు. ఇటీవల అనపర్తి మండలంలో ఉన్న 14 వాహనాలను ఈ నెల 20న తహశీల్దార్‌ కార్యాలయంలో అప్పగిం చారు. అయితే ఈ నెలాఖరు వరకు రేషన పంపిణీకి సహకరించాలని అధికారులు వారిని అభ్యర్థించారు. అంబాజీపేట మండలంలో 9 ఎండీ యూ వాహనాలను ఎంపీడీవో కార్యాలయంలో అప్పగించారు. 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. అయితే ఇంటింటికీ రేషన పథకం వల్ల నెలాఖరు కావస్తున్నా చాలా ప్రాంతాలకు రేషన అందలేదు. ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా  పనిచేస్తున్నామని, ఆయిల్‌, సహాయ కుని ఖర్చు, ఇతర మెయింటినెన్సులు భారీగా పెరిగిపోతున్నందున తాము వీటిని భరించడం కష్టమని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం పంపిణీ కారణం తలెత్తుతున్న అనేక సమస్యలతో పాటు నిర్వహణ వ్యయం రూ.25 వేలకు పైనే ఖర్చు అవుతున్నందున తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన మండలాల్లోనూ ఎండీయూ వాహనాలను అప్పగించే అవకాశం ఉండడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-02-26T06:50:55+05:30 IST