డంపింగ్‌ యార్డు కాదు... వరహాలగెడ్డే..!

ABN , First Publish Date - 2021-04-14T05:39:14+05:30 IST

పట్టణాన్ని సర్వంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నాం.. పచ్చదనం, పరిశుభ్రతలో తామే ఫస్ట్‌ అని మునిసిపల్‌ అధికారులు, పాలకులు చెబుతున్నారు. కానీ పట్టణ నడిబొడ్డులో ఉన్న వరహాల గెడ్డలో రోజు రోజుకు చెత్త, వ్యర్థాలు పేరుకుపోతుండడంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహన చోదకులు ముక్కులు మూసుకోవాల్సి వస్తుంది.

డంపింగ్‌ యార్డు కాదు... వరహాలగెడ్డే..!
వరహాల గెడ్డలో పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్త

 చెత్తా, వ్యర్థాలతో నిండిపోయిన వైనం

  తీవ్ర అవస్థలు పడుతున్న పార్వతీపురం పట్టణ ప్రజలు

  పట్టించుకోని సంబంధిత అధికారులు

పార్వతీపురంటౌన్‌, ఏప్రిల్‌ 13: పట్టణాన్ని సర్వంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నాం.. పచ్చదనం, పరిశుభ్రతలో తామే ఫస్ట్‌ అని మునిసిపల్‌ అధికారులు, పాలకులు చెబుతున్నారు. కానీ పట్టణ నడిబొడ్డులో ఉన్న వరహాల గెడ్డలో రోజు రోజుకు చెత్త, వ్యర్థాలు పేరుకుపోతుండడంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహన చోదకులు ముక్కులు మూసుకోవాల్సి వస్తుంది. వరహాల గెడ్డలో వ్యర్థాలు పేరుకపో తున్నాయని, వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపాలని, చుట్టు పక్కల నివాసి తులతో పాటు ప్రజా సంఘాలు.. అధికారులు, పాలకులను వేడుకుంటున్నా ఫలితం లేకుండాపోతుంది. వరహాల గెడ్డలో మరో డంపింగ్‌ యార్డుగా మారుతుం డడంతో మునిసిపల్‌ ప్రజారోగ్య శాఖాధికారులపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో బీఎన్‌బీ రావు కాలనీ శివారు నుంచి బైపాస్‌ కాలనీ శివారు వరకు వరహాల గెడ్డలో పూడికలతో పాటు చెత్త, వ్యర్థాలు తొల గించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు ఈ వ్యర్థాలను సంబంధిత అధికారులు తూతూ మంత్రంగా తొలగించారు. ఇప్పటికైనా ప్రజారోగ్య శాఖాధికా రులు త్వరితగతిన స్పందించి వరహాల గెడ్డలోని వ్యర్థాలు, చెత్తను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. 

 

Updated Date - 2021-04-14T05:39:14+05:30 IST