Advertisement
Advertisement
Abn logo
Advertisement

2022 లో జరిగేవి ఇవే.. 465 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణిలో ఏముందంటే..!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి 2019 చివరి నుంచి ప్రపంచ వ్యాప్తంగా విజృభిస్తోంది. ఇప్పటి వరకూ లక్షలాది మందిని బలి తీసుకుంది. రూపాలను మార్చుకుంటూ.. ప్రజలను ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పెడుతూనే ఉంది. ఈ ఏడాది మధ్యలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ.. ఒమైక్రాన్ మళ్లీ యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు 2022లో పరిస్థితులు ఇంతకంటే దారుణంగా ఉంటాయా? లేక మెరుగుపడతాయా? అని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణి ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 2022లో ఆయన చెప్పిన విషయాలను తెలుసుకుని వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. నోస్ట్రడామస్ ఎవరు? 2022 జరగబోయేది ఏంటి? అనే వివరాల్లోకి వెళితే..


భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలను తెలుసుకునేందుకు మనం సాధారణంగా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విషయాలను పరిశీలిస్తాం కదా. ఇదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్లు.. నోస్ట్రడామస్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఫ్రెంచ్ ప్రవక్త, జ్యోతిష్కుడు అయిన మైకేల్ డి నోస్టడామె.. ప్రపంచ వ్యాప్తంగా నోస్ట్రడామస్‌గా గుర్తింపు పొందారు. దక్షిణ ప్రాన్స్‌లోని సెయింట్ రెమి డీ ప్రావిన్స్‌లో 1503లో జన్మించిన ఈయన.. ‘లెస్ ప్రొఫెటీస్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలో నోస్ట్రడామస్.. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ప్రస్తావించారు. 465ఏళ్ల క్రితం ఆయన చెప్పిన అనేక విషయాలు జరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య.. 9/11 ఉగ్రదాడులను ఆయన ముందే ఊహించారు. ఈ క్రమంలోనే 2022‌లో చోటు చేసుకునే అనేక సంఘనల గురించి ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. 


వచ్చే ఏడాది భూమికి పెనుముప్పు పొంచి ఉన్నట్టు జోస్యం చెప్పారు. ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో వరదలు, మంటలు, కరువు, తుపాన్ల కారణంగా 2022లో ఫ్రాన్స్‌ దేశం సంక్షోభానికి గురవుతుందని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. 2022 నాటికి కృత్రిమ మేధస్సు ఆధిపత్యం టెక్నాలజీ రంగంలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. అదే విధంగా ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందని అంచనా వేశారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement