Train Journey: రైలులో ప్రయాణం చేసే తల్లులకు శుభవార్త.. మీ బుడ్డోడు లేదా చిట్టి తల్లి కోసం..

ABN , First Publish Date - 2022-05-10T19:12:02+05:30 IST

రైళ్లలో దూర ప్రయాణం చేసే వారు స్లీపర్ బెర్త్‌లు బుక్ చేసుకుంటారు. పాప లేదా బాబు కోసం మరో టికెట్ బుక్ చేయడం ఎందుకులే..

Train Journey: రైలులో ప్రయాణం చేసే తల్లులకు శుభవార్త.. మీ బుడ్డోడు లేదా చిట్టి తల్లి కోసం..

టికెట్ రిజర్వేషన్ చేసుకుని ప్రయాణం చేయాలేగానీ రైళ్లలో ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో గమ్య స్థానానికి చేరాలనుకునే మధ్య తరగతి ప్రజలకు రైళ్లే ప్రధాన రవాణా మార్గం. అయితే.. పిల్లలను తీసుకుని రైళ్లలో ప్రయాణం చేసే తల్లులు మాత్రం కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. రైళ్లలో దూర ప్రయాణం చేసే వారు స్లీపర్ బెర్త్‌లు బుక్ చేసుకుంటారు. పాప లేదా బాబు కోసం మరో టికెట్ బుక్ చేయడం ఎందుకులే అని కాస్త ఇరుకైనా తల్లీబిడ్డ కలిసి ఒకే స్లీపర్ బెర్త్‌లో ప్రయాణం చేస్తుంటారు. ఇలా ప్రయాణం చేయడం కొంత ఇబ్బందికరమే.



అందుకే.. భారతీయ రైల్వేకు చెందిన ఉత్తరాది రైల్వే జోన్ చిన్నపిల్లలతో ప్రయాణం చేసే తల్లులకు ఈ ఇక్కట్లను తప్పించేందుకు ఓ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తరాది రైల్వే జోన్ పరిధిలోని లక్నో డివిజన్‌ Extra Small Berthను ఏర్పాటు చేసింది. ‘Baby Berth’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ బెర్త్ ప్రత్యేకంగా చిన్నారుల కోసం రూపొందించబడింది. లోయర్ బెర్త్‌కు అనుబంధంగా పక్కనే ఉండేలా ఈ ‘Baby Berth’ను అందుబాటులోకి తెచ్చారు.



మదర్స్ డే సందర్భంగా Lucknow Mailలో కోచ్ నెంబర్ 194129/ B4, బెర్త్ నెం 12&60ను ‘బేబీ బెర్త్’తో కలిపి రూపొందించారు. తమ బిడ్డతో కలిసి ప్రయాణం చేసే తల్లుల కోసం ఈ బేబీ బెర్త్‌ను తీసుకొచ్చామని ఉత్తరాది రైల్వే జోన్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఈ ఆలోచనపై నెటిజన్ల నుంచి ఉత్తరాది రైల్వే జోన్‌కు ప్రశంసలు దక్కాయి. ఇది ఒక మంచి Initiative అని చాలా మంది నెటిజన్లు ట్వీట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇతర రైల్వే డివిజన్స్ కూడా ఈ తరహా బేబీ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అయితే.. ఈ బేబీ బెర్త్‌ బుక్ చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఎలా బుక్ చేసుకోవాలనే ప్రశ్నను కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.

Read more