ఉత్తరకొరియాతో ప్రాంతీయ భద్రతకు ముప్పు.. బ్రిటన్

ABN , First Publish Date - 2022-01-16T03:08:10+05:30 IST

వరుసగా క్షిపణులు ప్రయోగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఉత్తరకొరియాపై బ్రిటన్ తాజాగా అగ్గిమీద గుగ్గిలమైంది.

ఉత్తరకొరియాతో ప్రాంతీయ భద్రతకు ముప్పు.. బ్రిటన్

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా క్షిపణులు ప్రయోగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఉత్తరకొరియాపై బ్రిటన్ తాజాగా అగ్గిమీద గుగ్గిలమైంది. ప్రాదేశిక భద్రతకు శాంతియుత వాతావరణానికి ఉత్తరకొరియా ఓ మప్పుగా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం నాడు ఉత్తరకొరియా ఓ రైలుపై నుంచి మిసైల్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్షిఫని ప్రయోగం జరిగిన కొద్ది గంటలకే బ్రిటన్ ఉత్తరకొరియా దూకుడును ఖండిస్తూ ఘాటు ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇలాంటి రెచ్చ గొట్టే చర్యలను కట్టిపెట్టి అమెరికాలో చర్చలు ప్రారంభించాలని మేము ఉత్తరకొరియాను కోరుతున్నాం’’ అని బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2022-01-16T03:08:10+05:30 IST