Abn logo
Apr 13 2021 @ 00:05AM

నూకాలమ్మకు విశేష అలంకరణ

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 12: జంగారెడ్డిగూడెం నూకాలమ్మ జాతరలో భాగంగా సోమవారం అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. ఆలయంలో నర్మదా అమృత బాణ లింగేశ్వరునికి ఏకవార రుద్రాభిషేకం ప్రధానార్చకుడు యర్రమిల్లి మనోజ్‌శర్మ నిర్వహించారు. నూకాలమ్మకు నిత్య కైంకర్యాలు అనంతరం అభిషేకాలు నిర్వహించినట్టు ఆలయ కమిటీ చైర్మన్‌ రాజాన సత్యనారాయణ తెలిపారు.  అమ్మవారిని వీరంపాలెం బాల త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి దర్శించుకున్నారు. ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.

Advertisement
Advertisement
Advertisement