Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నూడుల్స్‌ సమోసా

నూడుల్స్‌ సమోసా

నోరూరించే న్యూడుల్స్‌

నూడుల్స్‌ అనగానే ఎవరికైనా టేస్ట్‌ చేయాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. అయితే నూడుల్స్‌ అంటే ఫ్రై ఒక్కటే కాదు. వాటితో సమోసాలు చేసుకోవచ్చు. సూప్‌ తయారుచేసుకుని లాగించొచ్చు. రొయ్యలతో కలిపి రుచి చూడొచ్చు. థాయ్‌ రుచులు ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. మరి ఈ వారం అలాంటి నూడుల్స్‌ రెసిపీల తయారీ విశేషాలు మీకోసం...


వందగ్రాముల నూడుల్స్‌లో పోషక విలువలు

క్యాలరీలు 137

ఫ్యాట్‌ 2.6గ్రా

కార్బోహైడ్రేట్లు 25గ్రా

ప్రొటీన్లు 4.5గ్రా


చైనాలో 4వేల ఏళ్ల క్రితమే నూడుల్స్‌ ఉన్నట్లు పరిశోధకుల అంచనా.

ఇప్పుడంటే నూడుల్స్‌ అందరికీ అందుబాటులో ఉన్నాయి కానీ ఒకప్పుడు లగ్జరీ ఫుడ్‌ అది. బాగా డబ్బున్న వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.

ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ను మొదట జపాన్‌ వాళ్లు తయారు చేశారు.

జపాన్‌లోని యోకొహోమాలో యోకొహోమా కప్‌ నూడుల్స్‌ పేరుతో ఒక మ్యూజియం ఉంది.


కావలసినవి: నూడుల్స్‌ ఉడికించినవి - ఒక బౌల్‌ నిండా, నూనె - సరిపడా, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, క్యాప్సికం - ఒకటి, క్యారెట్‌ - ఒకటి, క్యాబేజీ తురుము - ఒక కప్పు, ఉప్పు - రుచికి తగినంత, సోయా సాస్‌ - రెండు టీస్పూన్లు, వెనిగర్‌ - ఒకటేబుల్‌స్పూన్‌, మైదా - రెండు కప్పులు, గోధుమపిండి - ఒక కప్పు, వాము - ఒక టీస్పూన్‌, నీళ్లు - కొద్దిగా. 


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత క్యారెట్‌ ముక్కలు, క్యాప్సికం, క్యాబేజీ తురుము వేసి మరికాసేపు వేగించుకోవాలి. తగినంత ఉప్పు వేసి, సోయాసాస్‌, వెనిగర్‌, ఉడికించిన నూడుల్స్‌ వేసి కలుపుకోవాలి. కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌లో మైదా, గోధుమపిండి వేసి, తగినంత ఉప్పు, వాము, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తటి మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంటపాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చపాతీల్లా చేసుకోవాలి. తరువాత సగానికి కట్‌ చేసుకోవాలి. ఆ భాగాన్ని మళ్లీ సగానికి కట్‌ చేయాలి. తరువాత ఒక భాగం తీసుకుని మధ్యలో నూడుల్స్‌ మిశ్రమం పెట్టి చివర్లు నూనె లేదా నీటితో అద్దుతూ మూసేయాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక సమోసాలు వేసి డీప్‌ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా ఏదైనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి. 


మ్యాంగో డిలైట్మ్యాంగో డిలైట్థండాయి సిరప్‌థండాయి సిరప్‌మాల్పువా మాల్పువా మామిడికాయ పులిహోరమామిడికాయ పులిహోరకైరీ మ్యాంగో కర్రీకైరీ మ్యాంగో కర్రీచాక్లెట్‌ రవ్వలడ్డుచాక్లెట్‌ రవ్వలడ్డుస్పైసీ సలాడ్‌స్పైసీ సలాడ్‌కడికడిమెంతుల పులుసుమెంతుల పులుసుఆనపకాయ - గింజల పులుసుఆనపకాయ - గింజల పులుసు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.