జీడీలా!

ABN , First Publish Date - 2021-04-04T05:52:38+05:30 IST

న్న తరుణం లో రైతులు వ్యయప్రయసలతో వాటి ని కాపాడుకుంటూ వస్తు న్నారు. కానీ పంట పరిస్థితి చూస్తే ఆశాజనకంగా లేదు. అటు జీడి పరిశ్రమల నిర్వాహకులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల నిర్వహణకు అవసరమ య్యే జీడి ఉత్పత్తి అవుతుందా లేదా అన్న అనుమానం వారిని వెంటాడుతోంది. జీడి పూత ఆలస్యంపై ‘ఆంధ్రజ్యోతి’ ఉద్యానవన శాఖ అధికారి సునీత వద్ద ప్రస్తావించగా పొగమంచు కారణంగా జీడిపూత ఆలస్యమైం

జీడీలా!
మాడిపోయిన జీడి పూత



పూతకు రాని జీడి

ఆదిలోనే తెగుళ్లు

ఆందోళనలో ఉద్దానం రైతులు

వజ్రపుకొత్తూరు: ఉగాది సమీపిస్తోంది. ఏటా ఈ సమయానికి జీడి విరగకాసేది. జీడి ఉత్పత్తి ప్రారంభమయ్యేది. ఉద్దానం వాసులు జీడి సేకరణలో బిజిబిజీగా గడిపేవారు. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. పూత ఆశాజనకంగా లేకపోగా..ఎక్కడా సేకరణ ప్రారంభం కాలేదు. కొన్ని ప్రాంతాల్లో పూత లేకపోగా.. మరికొన్ని ప్రాంతాల్లో పూత మాడిపోతోంది. చీడలు, తెగుళ్లు ఆవహించ డంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయానికి 20 శాతం పంట చేరేదని...ఈ ఏడాది ఒక్క శాతం కూడా పండలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి డివిజన్‌లోని పది మండలా ల్లో జీడి పంట సాగవుతోంది. మొత్తం 10,545 హెక్టారుల్లో రైతు లు జీడి సాగుచేస్తున్నారు. తితలీ తరువాత పంట పరిస్థితి ప్రశ్నా ర్థకంగా మారింది. ఇప్పుడిప్పుడే చెట్లు జీవం పోసుకున్న తరుణం లో రైతులు వ్యయప్రయసలతో వాటి ని కాపాడుకుంటూ వస్తు న్నారు. కానీ పంట పరిస్థితి చూస్తే ఆశాజనకంగా లేదు. అటు జీడి పరిశ్రమల నిర్వాహకులు కూడా ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల నిర్వహణకు అవసరమ య్యే జీడి ఉత్పత్తి అవుతుందా లేదా అన్న అనుమానం వారిని వెంటాడుతోంది. జీడి పూత ఆలస్యంపై ‘ఆంధ్రజ్యోతి’ ఉద్యానవన శాఖ అధికారి సునీత వద్ద ప్రస్తావించగా పొగమంచు కారణంగా జీడిపూత ఆలస్యమైందన్నారు. 


Updated Date - 2021-04-04T05:52:38+05:30 IST