నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2022-08-08T06:54:24+05:30 IST

నాన్‌టెక్నికల్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య, పురపాలక సాంకేతిక శాఖ నాన్‌-టెక్నికల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మజ్జి ప్రసాద్‌ అన్నారు.

నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

- సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మజ్జి ప్రసాద్‌ 

సత్యనారాయణపురం, ఆగస్టు 7 : నాన్‌టెక్నికల్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య, పురపాలక సాంకేతిక శాఖ నాన్‌-టెక్నికల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మజ్జి ప్రసాద్‌ అన్నారు. ముత్యాలంపాడు జీఎ్‌సరాజు రోడ్డులో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య, పురపాలక సాంకేతిక శాఖ నాన్‌-టెక్నికల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్రకార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్య సాంకేతిక శాఖలో సమస్యల పరిష్కారానికి సంఘం ఏర్పాటు చేశామన్నారు. సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాలలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌లకు గెజిటెడ్‌ హోదా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో తక్షణమే ఎన్‌టీపీఏ పోస్టు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుపల్లి గురప్ప మాట్లాడుతూ, టెక్నికల్‌-నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగుల వేతనాల్లో వ్యత్యాసం సరిచేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సత్యనారాయణ, తాళ్లపాక సురేశ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తోట శ్రీనివాసులు, దాసరి జానకి రమణ, బి.శారద, కె.పవన్‌కుమార్‌, జోనల్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T06:54:24+05:30 IST