Abn logo
Jan 16 2021 @ 01:28AM

ముగిసిన నాన్‌ మహరాజ్‌ జాతర

సారంగాపూర్‌, జనవరి 15 : మండలంలోని బండరేవు తండాలో గల నాన్‌ మహరాజ్‌ జాతర శుక్ర వారం సాయంత్రం ముగిసింది. ఈ జాతర వారం రోజుల పాటు నిర్వ హించారు. ప్రతీరోజు ఆటల పోటీలు జరిగాయి. ఈ ఆటల పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహు మతులను అందించారు. ఈ నాన్‌ మహరాజ్‌ జాతరకు చుట్టు పక్కల ఉన్నటువంటి గ్రామస్థులు జాతర ముగింపు రోజు విందు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని సంపక్తి భోజనాలను చేశారు. 

మండలంలోని బండరేవు తండాలో జరుగుతున్న నాన్‌ మహరాజ్‌ జాతరను గురువారం కృష్ణా గోదావరి జలాల కన్వీనర్‌ రావుల రాంనాథ్‌ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. జాతరలో జరు గుతున్నటువంటి ఆటల పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను పరిచయం చేసు కున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మా నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అజ్మీరా శ్యాంనాయక్‌, నాయకులు అయ్యన్నగారి రాజేందర్‌, తోట సత్య నారాయణ, పొన్నం నారాయణగౌడ్‌, వినోద్‌, ఉమేష్‌ రాథోడ్‌, ఆలయకమిటీ సభ్యులు ఉన్నారు. 

Advertisement
Advertisement