సౌదీ వ‌చ్చే విదేశీయుల‌కు కింగ్‌డ‌మ్ కీల‌క సూచ‌న !

ABN , First Publish Date - 2021-06-17T19:39:53+05:30 IST

క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు సౌదీ అరేబియా ఇప్ప‌టికే ప్రయాణాల‌పై క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న విషయం తెలిసిందే.

సౌదీ వ‌చ్చే విదేశీయుల‌కు కింగ్‌డ‌మ్ కీల‌క సూచ‌న !

రియాధ్‌: క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు సౌదీ అరేబియా ఇప్ప‌టికే ప్రయాణాల‌పై క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న  విషయం తెలిసిందే. తాజాగా త‌మ దేశానికి వ‌చ్చే విదేశీయుల‌కు సౌదీ మ‌రో కీల‌క సూచ‌న చేసింది. విదేశీయులు ఎవ‌రైతే సౌదీ వ‌స్తారో వారు ప్ర‌యాణానికి ముందే ఆన్‌లైన్ ద్వారా త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ స్టేట‌స్‌ను న‌మోదు చేయాల‌ని సూచించింది. ప్ర‌యాణికులు ఏ టీకా తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని డోసులు తీసుకున్నారు అనే వివ‌రాల‌ను ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుందని పాస్‌పోర్ట్స్ జ‌న‌ర‌ల్ డైరెక్ట‌రేట్ వెల్ల‌డించింది. టీకా స్టేట‌స్‌ను న‌మోదు చేసుకోవ‌డం ద్వారా ఇమ్మిగ్రేష‌న్ ప్రాసెస్ వేగంగా జ‌రుగుతుంద‌ని, దీంతో ప్ర‌యాణికులు ఎక్కువ స‌మ‌యం నిరీక్షించాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని పేర్కొంది. ప్ర‌వాసులు, కొత్త‌గా వీసా పొందిన వారు, జీసీసీ దేశాల పౌరుల‌కు ఇదే రూల్ వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. క‌నుక ప్ర‌యాణికులంద‌రూ దీన్ని దృష్టిపెట్టుకుని త‌మ జ‌ర్నీని ప్లాన్ చేసుకోవాల‌ని సూచించింది.       

Updated Date - 2021-06-17T19:39:53+05:30 IST