Abn logo
Sep 25 2021 @ 12:25PM

Agra: బీజేపీ ఎంపీకి నాన్ బెయిలబుల్ వారంట్

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): కేంద్ర మాజీ మంత్రి, ప్రస్థుత ఎంపీ రామ్ శంకర్ కథేరియాకు కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.2009వ సంవత్సరంలో రైలు దిగ్బంధనలు కేసులో నేటికి కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎంపీ రామ్ శంకర్ కు కోర్టు ఎట్టకేలకు నాన్ బెయిలబుల్ వారంట్ ఇచ్చింది.ఆగ్రాలో అలహాబాద్ హైకోర్టు బెంచ్ డిమాండ్ కోసం ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు మద్ధతుగా 2009 సెప్టెంబరు 26వతేదీన ఎంపీ రామ్ శంకర్ రైలును నిలిపివేశారు. 


11 సంవత్సరాల క్రితం జరిగిన రైలు దిగ్బంధనం కేసులో కోర్టుకు హాజరు కాలేదని ఎంపీపై కోర్టు ఈ వారంట్ జారీ చేసింది. ఎంపీ కథేరియాతో పాటు, మాజీ ఎమ్మెల్యే బాబూలాల్ చౌదరి, కాంగ్రెస్ నాయకుడు ఇందిర వర్మ, హైకోర్టు న్యాయవాదుల సంఘర్ష్ సమితి సీనియర్ న్యాయవాది కెడి శర్మ, అరుణ్ సోలంకి, కున్వర్ శైలరాజ్ సింగ్ తదితరులు రైలును నిలిపిన కేసులో నిందితులుగా ఉన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption