Non bailable warrant: స్పీకర్, ఇద్దరు మంత్రులకు నాన్ బెయిలబుల్ వారంట్

ABN , First Publish Date - 2022-08-31T16:30:14+05:30 IST

పంజాబ్(Punjab) రాష్ట్రంలో ఓ కేసులో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఇద్దరు కేబినెట్ మంత్రులకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది....

Non bailable warrant: స్పీకర్, ఇద్దరు మంత్రులకు నాన్ బెయిలబుల్ వారంట్

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్(Punjab) రాష్ట్రంలో ఓ కేసులో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఇద్దరు కేబినెట్ మంత్రులకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్(Punjab Speaker) కుల్తార్ సింగ్ సాంధ్వాన్, కేబినెట్ మంత్రులు(two ministers) గుర్మిత్ సింగ్ మీట్ హయ్యర్, లాల్జీత్ సింగ్ భుల్లార్ లకు పంజాబ్ కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారంట్(Non bailable warrant) జారీ చేసింది. పంజాబ్ రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాలైన అమృత్ సర్, తరన్ తరన్ ప్రాంతాల్లో హుచ్ మృతుల సందర్భంగా స్పీకరు, ఇద్దరు మంత్రులతో పాటు పలువురు ఆప్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ ధర్నాపై వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టుకు హాజరు కాకపోవడంతో(failing to appear before court) కోర్టు వారికి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. 


Updated Date - 2022-08-31T16:30:14+05:30 IST