వాహన రిజిస్ట్రేషన్‌లో నామినీ వివరాలు

ABN , First Publish Date - 2020-11-28T07:57:09+05:30 IST

వాహన రిజిస్ట్రేషన్‌లో నామినీ వివరాలు ఇక మీదట తప్పనిసరికానుంది. ఈమేరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 చట్టానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సవరణలను ప్రతిపాదించింది

వాహన రిజిస్ట్రేషన్‌లో నామినీ వివరాలు

తప్పనిసరి చేసేలా కేంద్రం ప్రతిపాదనలు


నూఢిల్లీ, నవంబరు 27: వాహన రిజిస్ట్రేషన్‌లో నామినీ వివరాలు ఇక మీదట తప్పనిసరికానుంది. ఈమేరకు కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు-1989 చట్టానికి  కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ సవరణలను ప్రతిపాదించింది. దీని ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలోనే యజమాని నామినీ పేరును  ప్రతిపాదించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత సవరణవల్ల యజమాని చనిపోతే సదరు వాహనం రిజిస్ట్రేషన్‌/బదిలీ నామినీ పేరుమీద చేయడానికి ఎలాంటి ఇబ్బందులుండవు. కాగా, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌(బీఐఎస్‌) ధ్రువీకరించిన హెల్మెట్లనే దేశంలో తయారుచేసి అమ్మాలని కేంద్రం శుక్రవారం సర్క్యులర్‌ జారీచేసింది.   

Updated Date - 2020-11-28T07:57:09+05:30 IST