మళ్లీ ఫీచర్ ఫోన్ల బాటపట్టిన నోకియా

ABN , First Publish Date - 2020-08-15T22:18:45+05:30 IST

ఫీచర్ ఫోన్లను మళ్లీ తీసుకొస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న నోకియా ఈసారి మరో సరికొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి

మళ్లీ ఫీచర్ ఫోన్ల బాటపట్టిన నోకియా

న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్లను మళ్లీ తీసుకొస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న నోకియా ఈసారి మరో సరికొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది జూన్‌లో ‘నోకియా 5310 ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్’ ఫోన్‌ను తీసుకొచ్చిన నోకియా.. ‘టీఎ-1316’ మోడల్ నంబరుతో మరో అదిరిపోయే ఫీచర్‌ ఫోన్‌ను రెడీ చేస్తోంది. దీనికి ఇప్పటికే యూఎస్ ఎఫ్‌సీసీ ఆమోదం లభించినట్టు తెలుస్తోంది. 4జీ కనెక్టివిటీ, ఎల్‌టీఈ 5,7‌కు సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో 38 బ్యాండ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, 1150 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించినట్టు సమాచారం. డ్యూయల్ సిమ్, సింగిల్ కెమెరా, మోనో స్పీకర్ వంటివి నోకియా ‘టీఎ-1316’లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిని భారత్‌లో ఎప్పుడు లాంచ్ చేసేదీ తెలియరాలేదు. 

Updated Date - 2020-08-15T22:18:45+05:30 IST