తక్కువ రేటుకు ఎక్కువ బ్యాటరీతో నోకియా ఫోన్‌

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

రేటు తక్కువకు తోడు సింగిల్‌ చార్జింగ్‌తో 27 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌తో మొబైల్‌ని ఇండియన్‌ మార్కెట్‌లోకి నోకియా తాజాగా విడుదల చేసింది.

తక్కువ రేటుకు ఎక్కువ బ్యాటరీతో నోకియా ఫోన్‌

రేటు తక్కువకు తోడు సింగిల్‌ చార్జింగ్‌తో 27 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌తో మొబైల్‌ని ఇండియన్‌ మార్కెట్‌లోకి నోకియా తాజాగా విడుదల చేసింది. ‘నోకియా 8210 4జీ’ పేరిట విడుదలైన ఈ ఫోను పేరుకు తగ్గట్టే 4జీ కనెక్టివిటీ కలిగి ఉంది.  దీని రేటు రూ.3,999. ఫీచర్‌ ఫోన్లతో పోల్చుకుంటే దీని డిస్‌ప్లే కూడా ఎక్కువే. నోకియా అధికారిక వెబ్‌సైట్‌ అలాగే అమెజాన్‌ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు. డార్క్‌బ్లూ, రెడ్‌ కలర్స్‌లో ఇది లభ్యమవుతోంది. ఏడాది రీప్లేస్‌మెంట్‌ గ్యారంటీ కూడా ఇస్తోంది.  2.8 ఇంచీలకు తోడు క్యూవీజీఏ రిజల్యూషన్‌, యూనిసోక్‌ టీ107 చిప్‌ సెట్‌ పవర్‌ కలిగి ఉంది. 48 ఎంబీ ర్యామ్‌, 128 ఎంపీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉన్నాయి. 32 జీబీ వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. 0.3ఎంపీ కెమెరాకు తోడు సాదాసీదా ఫొటోగ్రఫీకి రేర్‌ పేనల్‌ ఉంది. 

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST