గూగుల్‌ మీట్‌లో నాయిస్‌ ఇండికేటర్‌

ABN , First Publish Date - 2022-08-20T05:55:32+05:30 IST

గూగుల్‌ మీట్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. చిన్నపాటిదే అయినప్పటికీ యూఐ అప్‌డేట్‌ తీసుకొచ్చింది. దీంతో గూగుల్‌ మీట్‌ని ఉపయోగించుకునే వ్యక్తులకు నాయిస్‌ కాన్సిలేషన్‌ అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ గురించి ...

గూగుల్‌ మీట్‌లో నాయిస్‌ ఇండికేటర్‌

గూగుల్‌ మీట్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. చిన్నపాటిదే అయినప్పటికీ యూఐ అప్‌డేట్‌ తీసుకొచ్చింది. దీంతో గూగుల్‌ మీట్‌ని ఉపయోగించుకునే వ్యక్తులకు నాయిస్‌ కాన్సిలేషన్‌ అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ గురించి చాలా తెలుస్తుందని బ్లాగ్‌పోస్టులో గూగుల్‌ పేర్కొంది. నేపథ్యంలో వచ్చే ధ్వనులను నాయిస్‌ కాన్సిలేషన్‌ ఫీచర్‌ అదుపు చేయగలుగుతుంది. ఇంతకుమునుపు సదరు ధ్వనులను గూగుల్‌ ఏ మేరకు నియంత్రిస్తోందన్నది తెలిసేది కాదు. గూగుల్‌ కొత్తగా బ్లూ వాయిస్‌ ఇండికేటర్‌ను జతచేసింది. ఇది ధ్వని ఏ మేరలో ఉంది, నాయిస్‌ కాన్సిలేషన్‌తో ఏ మేరకు తగ్గించగలిగిందీ తెలుస్తుంది. ఇందులో రింగ్‌ విస్తరిస్తూ ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌ నాయిస్‌ను తొలగిస్తున్నట్టు సూచిక.  వాయిస్‌ ఇండికేటర్‌ కనిపించకుంటే, ఆడియో లేనట్టే. రెడ్యూసింగ్‌ నాయిస్‌ మెసేజ్‌తో సర్కిల్‌ విస్తరిస్తూ ఉంటే నాయిస్‌ ఫిల్టర్‌ అవుతున్నట్టు లెక్క.


దాంతో హాజరైన వ్యక్తులకు మీ వాయిస్‌ మాత్రమే వినిపిస్తుంది. ఈ ఫిల్టరింగ్‌ నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. రింగ్‌ సైజ్‌ పెరుగుదల, తరుగుదలనుబట్టి నాణ్యత తెలుస్తూ ఉంటుంది. గూగుల్‌ వర్క్‌స్పేస్‌ బిజినెస్‌స్టాండర్డ్‌, బిజినెస్‌ ప్లస్‌, ఎంట్రప్రైజ్‌ ఎసెన్షియల్స్‌, ఎంట్రప్రైజ్‌ స్టాండర్డ్‌, ఎంట్రప్రైజ్‌ ప్లస్‌, ఎడ్యుకేషన్‌ప్లస్‌, వర్క్‌స్పేస్‌ ఇండివిడ్యువల్‌ కస్టమర్లకు ఈ సరికొత్త నాయిస్‌ కాన్సిలేషన్‌ ఇండికేటర్‌ని అందుబాటులోకి తెచ్చే పనిలో గూగుల్‌ ఉంది. అయితే ఇది గూగుల్‌ వర్క్‌స్పేస్‌ ఎసెన్షియల్స్‌, బిజినెస్‌ స్టార్టర్‌, ఎడ్యుకేషన్‌ ఫండమెంటల్స్‌, ఫ్రంట్‌లైన్‌, నాన్‌ ప్రాఫిట్స్‌, జీ సైట్‌ బేసిక్‌, బిజినెస్‌ కస్టమర్స్‌, పర్సనల్‌ గూగుల్‌ అకౌంట్‌ యూజర్స్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రాదు.

Updated Date - 2022-08-20T05:55:32+05:30 IST