నోయిడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు కరోనా

ABN , First Publish Date - 2020-07-05T21:17:16+05:30 IST

నోయిడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు కరోనా

నోయిడా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు కరోనా

నోయిడా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ యూపీలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలోని నోయిడా పట్టణంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు తెలిపారు. గౌతమ్ బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దీపక్ ఓహ్రికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయన లేనప్పుడు అదనపు సీఎంఓ నేపాల్ సింగ్ విధులు నిర్వహిస్తారని చెప్పారు. డాక్టర్ ఓహ్రి గత వారంలో జెజె క్లస్టర్ కాలనీతో సహా వివిధ కంటైన్ మెంట్ జోన్లను సందర్శించడంతో మెడికల్ ఆఫీసర్ కు కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-05T21:17:16+05:30 IST