క్లిక్‌ కెమిస్ట్రీని అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌

ABN , First Publish Date - 2022-10-07T09:28:25+05:30 IST

క్యాన్సర్‌ వంటి మహమ్మారులను మరింత సమర్థంగా ఎదుర్కొనే ఔషధాల తయారీలో కీలకంగా ఉపయోగపడే విధానాలను అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రజ్ఞులకు ఈ ఏటి రసాయన నోబెల్‌ లభించింది.

క్లిక్‌ కెమిస్ట్రీని అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌

స్టాక్‌హోం, అక్టోబరు 6: క్యాన్సర్‌ వంటి మహమ్మారులను మరింత సమర్థంగా ఎదుర్కొనే ఔషధాల తయారీలో కీలకంగా ఉపయోగపడే విధానాలను అభివృద్ధి చేసిన ముగ్గురు శాస్త్రజ్ఞులకు ఈ ఏటి రసాయన నోబెల్‌ లభించింది. అణువులను చిటికెలో కలపడానికి ఉపయోగపడే ‘క్లిక్‌ కెమిస్ట్రీ’, ప్రాణమున్న జీవుల్లో సైతం ఆ విధానం పనిచేసేలా ‘బయో ఆర్థోగోనల్‌ కెమిస్ట్రీ’ అభివృద్ధికి కృషి చేసినందుకుగాను.. అమెరికాకు చెందిన కారొలిన్‌ ఆర్‌ బెర్టోజీ, కె.బ్యారీ షార్ప్‌లెస్‌, డెన్మార్క్‌కు చెందిన మార్టెన్‌ మెల్డాల్‌ను సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు స్వీడిష్‌ కమిటీ ప్రకటించింది. ఈ పురస్కారంతోపాటు ఇచ్చే నగదు బహుమతి కోటి స్వీడిష్‌ క్రోనార్లను (దాదాపు రూ.7.42 కోట్లు) ముగ్గురికీ సమానంగా పంచనున్నారు. వీరిలో షార్ప్‌లెస్‌ (81)కు నోబెల్‌ రావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో 2001లో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.

Updated Date - 2022-10-07T09:28:25+05:30 IST