ఆందోళన వద్దు.. అవి పులి అడుగులు కాదు!

ABN , First Publish Date - 2021-06-13T05:15:57+05:30 IST

మండలంలోని ధర్మోరా గ్రామ సమీపంలో కనిపించినవి పులి అడుగులు కావని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లే దని కమ్మర్‌పల్లి అటవీ శాఖ అధికారి పద్మప్రియ అన్నారు.

ఆందోళన వద్దు.. అవి పులి అడుగులు కాదు!
అడుగులను పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారి పద్మప్రియ

మోర్తాడ్‌, జూన్‌ 12: మండలంలోని ధర్మోరా గ్రామ సమీపంలో కనిపించినవి పులి అడుగులు కావని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లే దని కమ్మర్‌పల్లి అటవీ శాఖ అధికారి పద్మప్రియ అన్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఆమె శనివా రం అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరి శీలించారు. స్థానిక రైతు.. పులి పడుకొని ఉండగా చూ శానని గ్రామంలో చెప్పడంతో గ్రామస్థులు ఆ ప్రాంతా న్ని పరిశీలించారు. కాగా, పులి అడుగులను పోలిన ఆన వాళ్లు ఉండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచా రం అందించారు. దీంతో ఆ శాఖ అధికారి పద్మప్రియ తన సిబ్బందితో పాటు గ్రామస్థులతో కలిసి ఆ ప్రాంతా న్ని పరిశీలించారు. కాగా.. ఆ అడుగులను పరిశీలి ంచి అవి పులి అడుగులు కావని స్పష్టం చేశా రు. పులి పాదానికి తొమ్మిది వేళ్లు ఉంటాయని ఆమె వివరించారు. ఈ అడుగులు ఏ జంతువు తెలియాలని ఫొటోలు తీశామని, వాటిని పరిశోధన కేంద్రానికి పంపి నిర్ధారి స్తామని గ్రామస్థులకు తెలిపారు. గ్రామస్థులు భయపడవద్దని అధికారులు సూచించారు. అధికారుల వెంట సర్పంచ్‌ రాజేశ్వర్‌, ఫారెస్టు అధికారి రవి కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T05:15:57+05:30 IST