ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం

ABN , First Publish Date - 2022-01-14T08:38:15+05:30 IST

‘‘ఒమైక్రాన్‌పై తొలినాళ్లలో ఉన్న సందేహాలన్నీ క్రమంగా తొలగిపో యాయి.

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం

  • కరోనాపై పోరులో మూడో ఏడాదిలోకి..
  • ఒమైక్రాన్‌పై సందేహాలు తొలగుతున్నాయి
  • జీవనోపాధికి విఘాతం కలగనీయొద్దు
  • 70% మందికి రెండు డోసులూ.. 
  • ‘హర్‌ ఘర్‌ దస్తక్‌’తో 
  • 100ు మందికీ టీకాలు వేయాలి
  • ఒమైక్రాన్‌పై సీఎంల భేటీలో ప్రధాని మోదీ


న్యూఢిల్లీ, జనవరి 13: ‘‘ఒమైక్రాన్‌పై తొలినాళ్లలో ఉన్న సందేహాలన్నీ క్రమంగా తొలగిపో యాయి. గత వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా వేగంగా ప్రజలకు సోకుతోంది. దీని విషయంలో మనమందరం చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ తీవ్ర భయాందోళనలకు గురి కావొద్దు. 130 కోట్ల మంది భారతీయుల సమష్టి కృషితో ఈ మహమ్మారిపై మనం విజయం సాధిస్తాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అన్నారు. ఒమైక్రాన్‌ వల్ల దే శంలో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం సాయంత్రం వర్చువల్‌గా సమావేశమై కేసుల కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై, రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితిపై చర్చించారు. వందేళ్లలో ముంచుకొచ్చిన అతిపెద్ద మహమ్మారిపై పోరాటంలో మూడో ఏడాదిలోకి అడుగుపెట్టామని, స్థానిక కట్టడి వ్యూహాలతో వైరస్‌ వ్యాప్తికి చెక్‌ పెట్టాలని.. అదే సమయంలో ప్రజల జీవనభద్రతకు వీలైనంత తక్కువ నష్టం కలిగించేలా కొవిడ్‌ కట్టడి వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు. ‘‘15-17 ఏళ్ల వారిలో 3 కోట్ల మందికి 10 రోజుల్లో మనం టీకాలు వేశాం. ఈ సమస్యను ఎదుర్కోవడంలో మన సన్నద్ధతను, భారతదేశ సత్తాను ఇది చాటుతోంది. అలాగే మనదేశంలో తయారైన టీకాలు తమ గొప్పదనాన్ని ప్రపంచమంతా చాటుకుంటున్నాయి. దేశంలో 92% మందికి తొలి డోసు, 70ు మందికి రెండు డోసుల టీకా వేయడం అందరికీ గర్వకారణం. దీన్ని ఇలాగే కొనసాగించి ‘హర్‌ ఘర్‌ దస్తక్‌ (ప్రతి ఇంటి తలుపు తట్టి)’ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ద్వారా 100ు వ్యాక్సినేషన్‌ అయ్యేలా కృషి చేయాలి’’ అని మోదీ పేర్కొన్నారు. కరోనాపై పోరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి, సీనియర్‌ సిటిజన్లకు ఎంతత్వరగా బూస్టర్‌ డోసు టీకాలు ఇస్తే మన ఆరోగ్య వ్యవస్థలు అంత బలోపేతమవుతాయని మోదీ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-14T08:38:15+05:30 IST