కరోనా కేసులు పెరిగినా కంగారొద్దు

ABN , First Publish Date - 2020-03-29T09:16:01+05:30 IST

తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి! శనివారం మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి! తాజాగా 74 ఏళ్ల వృద్ధుడు కూడా మరణించాడు. ఇక నుంచి కరోనా కేసులు పెరగనున్నాయా!? రాబోయే

కరోనా కేసులు పెరిగినా  కంగారొద్దు

  • ఇవన్నీ లాక్‌డౌన్‌కు ముందు సోకినవే.. 
  • అప్పటికే విదేశాల నుంచి తెలంగాణకు
  • జనతా కర్ఫ్యూకు ముందు రోజు
  • యథేచ్ఛగా బయటకు వచ్చిన జనాలు
  • లాక్‌డౌన్‌ తొలి రోజుల్లో ఉల్లంఘనలు
  • ఇప్పుడు పెరిగే కేసులు వాటి ప్రభావమే
  • మరో వారం కేసులు పెరిగే అవకాశం
  • లాక్‌డౌన్‌ విజయవంతమైతే ఏప్రిల్‌ 
  • 9వ తేదీ తర్వాత కేసులు తగ్గే చాన్స్‌
  • సరిహద్దులను మూసేయడమే కీలకం


హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 14 కేసులు నమోదయ్యాయి! శనివారం మరో 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి! తాజాగా 74 ఏళ్ల వృద్ధుడు కూడా మరణించాడు. ఇక నుంచి కరోనా కేసులు పెరగనున్నాయా!? రాబోయే రోజులు ఆందోళనకరమేనా!? అయితే, అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు వైద్య నిపుణులు! ఇందుకు కారణాన్ని కూడా వివరిస్తున్నారు. దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను మార్చి 22వ తేదీన విధించారు. ఆ తర్వాత మార్చి 23వ తేదీ నుంచి తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణంగా, కరోనా సోకిన ఐదు రోజుల నుంచి 14 రోజుల మధ్య దాని లక్షణాలు బయటపడతాయి. అంటే, లాక్‌డౌన్‌కు ముందు మార్చి 15వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య చాలామంది విదేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణకు వచ్చారు. వారికి కరోనా సోకి ఉంటే.. సదరు వ్యక్తికి లక్షణాలు 20వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకూ బయటపడే అవకాశం ఉంది. అదే సమయంలో, జనతా కర్ఫ్యూ కు ముందు, లాక్‌ డౌన్‌ సమయంలో తెలంగాణలో కొన్ని అపశ్రుతులు జరిగాయి.


కొంతమంది నిబంధనలను పట్టించుకోలేదు. జనతా కర్ఫ్యూకు ముందు రోజు పెద్ద ఎత్తున మాల్స్‌, సూపర్‌ మార్కెట్లకు వెళ్లి సరుకు లు కొనుగోళ్లు చేశారు. ఇక, లాక్‌ డౌన్‌ మొదటి రెండు, మూడు రోజుల్లోనూ పెద్దఎత్తున బయటకు వచ్చారు. హాస్టళ్లను ఖాళీ చేయాలని చెప్పడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. పోలీసు స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో గుమిగూడారు. వీరికి సంబంధించిన కేసులు మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 9వ తేదీ మధ్య బయటపడే అవకాశం ఉంటుంది. అంటే, లాక్‌డౌన్‌కు ముందు; లాక్‌డౌన్‌ సమయంలో వ్యాధి బారిన పడిన వారికి సంబంధించి మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ మధ్య పెద్దఎత్తున కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు రోజులుగా ఎక్కువ కేసులు నమోదు కావడానికి కారణం ఇదేనని స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని రోజులపాటూ ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుందని, దీని విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు.


లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై, దానిని విజయవంతం చేస్తే, ఏప్రిల్‌ 9వ తేదీ తర్వాత పాజిటివ్‌ కేసు ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ ప్రజలు బయటకు వచ్చి తిరిగితే, నిబంధనలను పాటించకపోతే ఆ తర్వాత కూడా తీవ్రత కొనసాగే అవకాశం ఉంటుందని, ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ లాక్‌ డౌన్‌ను ప్రకటించడంలోని పరమార్థం ఇదేనని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. మూడో దశకు చేరకుండా కరోనాను నిలువరించగలిగితే, కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించిన ఏప్రిల్‌ 14వ తేదీ అర్ధరాత్రిలోపు వైర్‌సకు చరమగీతం పాడేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ఇప్పుడు నాలుగైదు రోజులపాటు కేసులు పెరిగినా కంగారు పడాల్సిన అవసరం లేదని వివరిస్తున్నారు.


ఇరుగు పొరుగు రాష్ట్రాలతో జాగ్రత్త

తెలంగాణకు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కరోనా వేగం గా విస్తరిస్తోంది. వీటిలో మహారాష్ట్ర, కర్ణాటకల్లో అత్యం త వేగంగా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో వైరస్‌ ఏకంగా మూడో దశకు చేరుకుంది. అక్కడి ముంబై, పుణె, గుర్గావ్‌ల్లో క్లస్టర్‌ కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంటే, సామూహికంగా ఒకేచోట ఆ 3 ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. శనివారం సాయంత్రం వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 164 కేసులు నమోదు కాగా నలుగురు మరణించారు. ఆ రాష్ట్రంతో తెలంగాణ ప్రజలకు బాగా సంబంధాలున్నాయి. భివండీ, షోలాపూర్‌, నాందేడ్‌, నాగ్‌పూర్‌, పుణె, ముంబైకు వ్యాపార నిమిత్తం; షిర్డీ, శనిసింగనాపూర్‌, నాసిక్‌, ఔరంగాబాద్‌ తదితర ప్రాంతాలకు పర్యాటకులుగా, భక్తులుగా వెళుతుంటారు.


రాష్ట్ర సరిహద్దులు మూసివేసే వరకు ఇక్కడ రాకపోకలు సాగాయి. అక్కడ రెండో దశ ప్రారంభమైన తర్వాతా అటు, ఇటు వాహనాలు నడిచాయి. ఇటీవలి కాలంలో పుణె, గుర్గావ్‌ తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికీ పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుంది. ఇక, కేసుల వ్యాప్తిలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. ఇక్కడ 74 కేసులు నమోదు కాగా కరోనాతో ఇప్పటికే ముగ్గురు మరణిం చారు. మరోవైపు, ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతోంది.   పక్క రాష్ట్రాలనుంచి ఏ ఒక్కరిని రానీయకుండా ప్రభు త్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

Updated Date - 2020-03-29T09:16:01+05:30 IST