వాళ్లకేం పనిలేదు.. గువాహటిలోనే విశ్రాంతి తీసుకోవచ్చు : Shivasena రెబల్ ఎమ్మెల్యేలపై Sanjay Raut ఫైర్

ABN , First Publish Date - 2022-06-28T19:16:19+05:30 IST

తిరుగుబాటు వర్గానికి సారధ్యం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), ఇతర రెబల్ ఎమ్మెల్యేల(Rebal MLAs) పిటిషన్లపై సుప్రీంకోర్ట్(Supreme Court) ఆదేశాల నేపథ్యంలో శివసేన అగ్రనేత సంజయ్ రౌత్(Sanjay Raut) మంగళవారం ఘాటుగా స్పందించారు.

వాళ్లకేం పనిలేదు.. గువాహటిలోనే విశ్రాంతి తీసుకోవచ్చు : Shivasena రెబల్ ఎమ్మెల్యేలపై Sanjay Raut ఫైర్

ముంబై : తిరుగుబాటు వర్గానికి సారధ్యం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), ఇతర రెబల్ ఎమ్మెల్యేల(Rebal MLAs) పిటిషన్లపై సుప్రీంకోర్ట్(Supreme Court) ఆదేశాల నేపథ్యంలో శివసేన అగ్రనేత సంజయ్ రౌత్(Sanjay Raut) మంగళవారం ఘాటుగా స్పందించారు. వాళ్ల(రెబల్ ఎమ్మెల్యేలు)కు మహారాష్ట్ర(Maharastra)లో పనేమీ లేదు. కాబట్టి జులై 11 వరకు గువాహటి(Guwahati)లోనే విశ్రాంతి తీసుకోవచ్చని విమర్శించారు. సుప్రీం ఆదేశాలనుద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘ జులై 11 వరకు గువాహటిలోనే ఉండమని చెప్పే ఆదేశాలివి. వాళ్లకు మహారాష్ట్రలో పనేమీ లేదు ’ అని సంజయ్ రౌత్ విమర్శించారు. రెబల్ ఎమ్మెల్యేల్లో కొంతమంది తిరిగొస్తారనే నమ్మకం ఉందన్నారు. తాము రెబల్స్‌గా భావించని ఎమ్మెల్యేలు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వారు తమతో టచ్‌లో ఉన్నారు. వారి కుటుంబాలు కూడా తమతో ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేలు తిరిగొస్తారనే నమ్మకం ఉందని రౌత్ అన్నారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో బీజేపీ(BJP), దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) తలదూర్చకూడదని ఆయన హెచ్చరించారు. వాళ్లగనుక వేలు పెడితే ప్రధాని నరేంద్రమోడీ(PM Narendra Modi) కళంకితుడు అవుతారన్నారు.


శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో సోమవారం ఊరట లభించింది. డిప్యూటీ స్పీకర్‌ వారికి పంపిన అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వడానికి జూలై 12 దాకా కోర్ట్ సమయమిచ్చింది. అప్పటిదాకా అనర్హత ప్రక్రియపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని.. 39 మంది రెబెల్‌ శివసేన ఎమ్మెల్యేల ప్రాణాలను, స్వేచ్ఛను, వారి ఆస్తులను కాపాడాల్సిందిగా ఆదేశించింది. ఈ పరిణామం రెబల్ వర్గానికి ఊరటనిచ్చింది.


జులై 5 వరకు గువాహటిలోనే రెబల్ ఎమ్మెల్యేలు..

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు జులై 5 వరకు గువాహటిలోనే ఉండనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మహారాష్ట్రకు వచ్చే అవకాశాల్లేవని, మరికొన్ని రోజులూ రాడీసన్ బ్లూ హోటల్‌లోనే ఉండే అవకాశాలున్నాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. జులై 5 వరకు హోటళ్లో గదులను బుక్ చేసుకున్నారు. అవసరమైతే బుకింగ్ సమయాన్ని పొడగించుకోవచ్చునని తెలిపాయి.

Updated Date - 2022-06-28T19:16:19+05:30 IST