నీటి సమస్యలు లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2022-07-05T05:23:25+05:30 IST

నీటి సమస్యలు లేకుండా చూడాలి

నీటి సమస్యలు లేకుండా చూడాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌

  • చౌదరిగూడ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ 


చౌదరిగూడ, జూలై 4: గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సమస్యలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ సంబంధిత అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీపీ యాదమ్మ అధ్యక్షతన సోమవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. తహసీల్దార్‌ గైర్హాజరు కావడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే వాచ్యతండా సర్పంచ్‌ ముడవత్‌ గాగ్లీ, చేగిరెడ్డి ఘణపూర్‌, పద్మారం గ్రామాల సర్పంచులు తమ గ్రామంలో సంవత్సర కాలంగా మిషన్‌ భగీరథ నీరు అందడం లేదని సభ దృష్టికి తెచ్చారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 71మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అదేవిధంగా చేగిరెడ్డి ఘణపూర్‌ గ్రామానికి చెందిన వి.వెంకటేశ్‌కు దళితబంధు పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్‌ను అందజేశారు. ఈ సమావేశంలో మార్కెట్‌కమిటీ చైర్మన్‌ కవిత, జడ్పీటీసీ బంగారు స్వరూప, వైస్‌ ఎంపీపీ అశ్రాభేగం, పీఏసీఎస్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, ఎంపీడీవో మహేశ్‌బాబు, సీడీపీవో నాగమణి తదితరులు పాల్గొన్నారు.

సీసీరోడ్డు పనులు ప్రారంభం 

షాద్‌నగర్‌ అర్బన్‌, జూలై 4: మున్సిపాలిటీలోని 6వ వార్డులో రూ.55లక్షల మీషన్‌ భగీరథ వ్యయంతో నిర్మించిన రెండు సీసీరోడ్లను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సీసీరోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణానికి టీఎ్‌సఐడీసీ పథకం కింద రూ.18కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అంతకు ముందు ఫరూఖ్‌నగర్‌ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన కోకె చుక్కమ్మకు రూ.2లక్షల ప్రమాదబీమా చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి, జడ్పీటీసీ పి.వెంకట్‌రాంరెడ్డి, కౌన్సిలర్లు పి.లతశ్రీశ్రీశైలంగౌడ్‌, ఎస్‌.రాజేశ్వర్‌, మెగా కంపెనీ ప్రతినిధి మోహన్‌రెడ్డి, నాయకులు విశ్వం, నారాయణయాదవ్‌, యాదగిరియాదవ్‌, నర్సింహ, శంకర్‌, రఘుపతిరెడ్డి   తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-05T05:23:25+05:30 IST